Father suicide after poisoning children: ఛత్తీస్గఢ్ సుర్గుజాలో హృదయ విదారక ఘటన జరిగింది. అంబికాపుర్లో ఓ వ్యాపారవేత్త తన పిల్లలకు విషం ఇచ్చి చంపేశాడు. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రితో పాటు ఎనిమిదేళ్ల కూతురు మరణించగా.. ఏడాదిన్నర కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ఆ వ్యక్తి ఇలా ఎందుకు చేశాడన్న విషయం తెలియలేదు.
Father poisoned kids
సుదీప్ మిశ్ర అనే వ్యాపారి.. వసుంధర విహార్ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకున్నాడని స్థానిక ఏఎస్పీ వివేక్ శుక్లా పేర్కొన్నారు. అతడి ఇద్దరు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఇరువురినీ ఆస్పత్రికి తరలించగా.. ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
సుదీప్ మిశ్ర.. గోదాన్పుర్లో సిమెంట్ వ్యాపారం చేసేవారని పోలీసులు చెప్పారు. తన భార్యను మార్కెట్కు పంపిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అందుకు ఒప్పుకోలేదని కన్న కూతుర్ని కడతేర్చిన తండ్రి!