ETV Bharat / bharat

దిల్లీ సరిహద్దుల్లో రైతుల శాశ్వత నివాసాలు

author img

By

Published : Mar 13, 2021, 5:04 PM IST

సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఉద్యమం ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు. మోదీ ప్రభుత్వ పదవీకాలం ముగిసే వరకు పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న అన్నదాతలు.. సరిహద్దుల్లో శాశ్వత నివాసాలు నిర్మించుకుంటున్నారు. దిల్లీ-హరియాణా మార్గంలోని టిక్రీ సరిహద్దు వద్ద ఇటుకలతో ఇళ్లు కట్టుకుంటున్నారు. ఇప్పటికే 25 నిర్మాణాలు పూర్తవగా.. రానున్న రోజుల్లో 1000 నుంచి 2వేల ఇళ్లను నిర్మించుకోనున్నట్లు కిసాన్‌ సోషల్‌ ఆర్మీ నాయకుడు అనిల్‌ మాలిక్‌ తెలిపారు.

farmers are making permanent houses on sonipat Singhu border
దిల్లీ సరిహద్దుల్లో రైతుల శాశ్వత నివాసాలు

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం సాగిస్తున్న రైతులు.. ఇప్పుడప్పుడే వెనక్కి తగ్గేలా కన్పించట్లేదు. మోదీ ప్రభుత్వ పదవీకాలం ముగిసే వరకు పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న రైతులు.. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో శాశ్వత నివాసాలు నిర్మించుకుంటున్నారు. దిల్లీ-హరియాణా మార్గంలోని టిక్రీ సరిహద్దు వద్ద ఇటుకలతో ఇళ్లు కట్టుకుంటున్నారు. ఇప్పటికే 25 నిర్మాణాలు పూర్తవగా.. రానున్న రోజుల్లో 1000 నుంచి 2వేల ఇళ్లను నిర్మించుకోనున్నట్లు కిసాన్‌ సోషల్‌ ఆర్మీ నాయకుడు అనిల్‌ మాలిక్‌ తెలిపారు. టిక్రీతో పాటు ఇతర సరిహద్దుల్లోనూ ఇలాంటి నిర్మాణాలే జరుగుతున్నాయి. ఇటుకలు, సిమెంట్‌ కొనుగోలు చేసి రైతులే నిర్మించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గతేడాది నవంబరు నుంచి రైతన్నలు దిల్లీ శివారుల్లో బైఠాయించిన విషయం తెలిసిందే. సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. చట్టాలను కొంతకాలం పాటు నిలిపివేస్తామని, వాటిల్లో సవరణలు చేస్తామని కేంద్రం చెబుతోంది. అయితే రైతులు మాత్రం ఇందుకు అంగీకరించట్లేదు. పూర్తిగా రద్దు చేయాలని, అప్పటిదాకా ఉద్యమం విరమించేది లేదని కరాఖండీగా చెప్పారు. మార్చి 26 నాటికి ఆందోళన చేపట్టి నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున భారత్‌ బంద్‌ చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: చెట్టుపై పిడుగు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.