ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్‌లను విమర్శిస్తూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టును ఫేస్బుక్ తొలగించడాన్ని.. ఆ సంస్థ ఏర్పాటుచేసిన స్వతంత్ర పర్యవేక్షణ మండలి తప్పుపట్టింది. మతపరమైన మైనారిటీల గొంతు నొక్కేలా పొరపాట్లు చేయకూడదని హితవు పలికింది.
భారత్‌లో ప్రతిపక్షాల వాణిని కేంద్రం ఖాతరు చేయడం లేదని, మైనారిటీల ఆందోళనలనూ పట్టించుకోవడం లేదని పంజాబీ భాషలో ఓ వ్యక్తి ఫేస్బుక్లో గతంలో పోస్టు పెట్టారు. ప్రమాణాలకు విరుద్ధంగా ఉందంటూ ఫేస్బుక్ తొలుత దాన్ని తొలగించింది. అనంతరం పునరుద్ధరించింది.
ఈ వ్యవహారాన్ని పర్యవేక్షణ మండలి ఫిబ్రవరిలో విచారణకు స్వీకరించింది. సదరు పోస్ట్‌ను తొలగిస్తూ ఫేస్బుక్ తొలుత తీసుకున్న నిర్ణయం తప్పు అని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: మోదీ వ్యతిరేక పోస్ట్‌లను బ్లాక్ చేసిన ఫేస్బుక్!
కరోనా కట్టడి చర్యలపై కేంద్రానికి హైకోర్టు చురకలు!