ETV Bharat / bharat

'టీకాతో సంబంధం లేదు- అందరిపైనా డెల్టా తీవ్ర ప్రభావం!' - భారత్​లో కొవిడ్ కేసులు

కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్లో.. వ్యాక్సినేషన్ స్టేటస్​తో సంబంధం లేకుండా డెల్టా వేరియంట్ వైరల్ లోడు ఉంటోందన్న అమెరికా సీడీసీ నివేదికపై భారత్​లోని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నివేదిక ఫలితాలు మన దేశానికీ వర్తిస్తాయని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

delta virus
డెల్టా వ్యాప్తి
author img

By

Published : Aug 1, 2021, 12:12 PM IST

కరోనా వైరస్​కు సంబంధించి అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) విడుదల చేసిన తాజా నివేదిక ఆందోళన కలిగిస్తోంది. డెల్టా వ్యాప్తిపై కొత్త విషయాలను ఇది వెలుగులోకి తెచ్చింది. టీకా తీసుకున్న, తీసుకోని వారిలో డెల్టా వైరస్ లోడు అధికంగా ఉంటోందని నివేదిక పేర్కొంది.

టీకా తీసుకున్నప్పటికీ డెల్టా వేరియంట్ సోకిన వ్యక్తి అదే స్థాయిలో వైరస్​ను వ్యాప్తి చేస్తారని సీడీసీ స్పష్టం చేసింది. కాబట్టి, వ్యాక్సినేషన్ స్టేటస్​తో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించింది.

"అధిక వైరల్ లోడు అంటే వైరస్ వ్యాప్తి చెందే ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని అర్థం. ఇతర వేరియంట్ల మాదిరిగా కాకుండా.. డెల్టా సోకిన వ్యక్తి వైరస్​ను అదే స్థాయిలో వ్యాపింపజేస్తారు. ఈ ఫలితాల కారణంగానే మాస్కు నిబంధలను సీడీసీ సవరించింది. తమకు తెలియకుండా ఇతరులకు వైరస్ వ్యాప్తి చేయకుండా ఉంచేలా.. ఈ నిబంధన ఉపయోగపడుతుంది."

-రోషెల్ పీ వాలెన్​స్కీ, సీడీసీ డైరెక్టర్

భారత్​లోనూ అంతే..

ఈ నివేదిక భారత్​లోని పరిస్థితులకూ వర్తిస్తుందని దేశంలోని నిపుణులు చెబుతున్నారు. మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నారు. ఇండోర్ సమావేశాలు, పని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

"భారత్ విషయానికి వచ్చే సరికి ఈ అధ్యయనం చాలా ముఖ్యమైనది. మాస్కులను పెట్టుకోవడమే కాకుండా.. ఇండోర్ మీటింగులు, రెస్టారెంట్లు, బార్లు, పండగల సమావేశాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. డెల్టాపై అప్రమత్తత అవసరం."

-డాక్టర్ తమోరిశ్ కోలె, ఆసియన్ సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్

ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న టీకాలలో కొవాగ్జిన్, కొవిషీల్డ్​.. అన్ని వేరియంట్లపైనా సమర్థంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెల్టా ప్లస్​పై టీకా పనితీరును విశ్లేషించే అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే, దేశవ్యాప్తంగా ఆర్ వ్యాల్యూ పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆర్‌-ఫ్యాక్టర్‌ పెరుగుతోంది సుమా!

"దేశంలో ఆర్ వ్యాల్యూ క్రమంగా పెరగడం గుర్తిస్తున్నాం. కరోనా వ్యాప్తికి సంబంధించి ఇది ఆందోళకరమైన విషయం. మూడో వేవ్​ను దృష్టిలో ఉంచుకొని కొంచెం తెలివిగా వ్యవహరించాలి. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ చేపట్టాలి."

ఒక ప్రాంతంలో కొవిడ్ ఏ స్థాయిలో విజృంభిస్తుందనే విషయాన్ని ఆర్​-ఫ్యాక్టర్​తో సూచిస్తారు.

మరోవైపు, దేశంలోని అనేక రాష్ట్రాలు కరోనా ఆంక్షలను సడలిస్తున్నాయి. త్వరలో మరిన్ని మినహాయింపులను ఇచ్చే యోచనలో ఉన్నాయి. వంద శాతం సామర్థ్యంతో బస్సులు, మెట్రోలు నడుస్తున్నాయి. ఫలితంగా 10 రాష్ట్రాల్లో వైరస్ గ్రాఫ్ పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా 44,230 కేసులు నమోదయ్యాయి. గత మూడు వారాల వ్యవధిలో అత్యధిక కేసులు ఇవే. ఈ నేపథ్యంలో మూడో దశ కరోనా వ్యాప్తిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.