ETV Bharat / bharat

'ఎస్​బీఐ మాజీ ఛైర్మన్ భారీ మోసం.. రూ.200 కోట్ల ఆస్తిని...'

ఓ హోటల్​ను నిరర్థక ఆస్తి(ఎన్​పీఏ)పేరుతో తక్కువ ధరకు విక్రయించిన కేసులో ఎస్​బీఐ మాజీ ఛైర్మన్​ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వ్యవహారంపై హోటల్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించగా.. సదరు అధికారిని అరెస్ట్​ చేయాలని ఆదేశించింది కోర్టు.

Ex-SBI chairman
ఎస్​బీఐ ఛైర్మన్
author img

By

Published : Nov 1, 2021, 5:27 PM IST

రూ.200 కోట్లు విలువ చేసే హాటల్​ను నిరర్థక ఆస్తి పేరుతో రూ. 25 కోట్లకు విక్రయించారు ఎస్​బీఐ మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌదరి. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏం జరిగిందంటే..?

రాజస్థాన్​ జైసల్మేర్​కు చెందిన ఓ హోటల్ గ్రూప్​.. 2008లో ఎస్​బీఐ నుంచి రూ. 24కోట్లు రుణం పొందింది. ఆ తర్వాత రుణం చెల్లించని క్రమంలో నిరర్థక ఆస్తి(ఎన్​పీఏ) కింద.. సదరు​ సంస్థకు చెందిన రెండు హోటళ్లనూ బ్యాంకు జప్తు చేసింది. ఆ సమయంలో ఎస్​బీఐ ఛైర్మన్​గా ప్రతీప్ చౌదరి ఉన్నారు.

ఆ హోటళ్లను నిరర్థక ఆస్తులుగా ప్రకటించి రూ. 25కోట్లకు వేరొక సంస్థకు విక్రయించారు ప్రతీప్. పదవీ విరమణ పొందాక.. హోటళ్లను విక్రయించిన కంపెనీకే డైరెక్టర్​గా మారారు​.

2017లో ఆ హోటళ్ల విలువ దాదాపు రూ.160 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ. 200కోట్లకు చేరింది. ఈ వ్యవహారంలో హోటల్ గ్రూప్ యజమాని.. జైసల్మేర్​ కోర్టును ఆశ్రయించగా.. ప్రతీప్ చౌదరిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. దిల్లీలో ఉన్న ప్రతీప్​ను అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: 'మోదీ సభలో ఉగ్రదాడి' కేసులో నలుగురికి ఉరిశిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.