ETV Bharat Telugu Whats App Channel : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల కొత్తగా ఛానెల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత్ సహా 150 దేశాల్లో ఈ ఫీచర్‌ను ప్రారంభించినట్లు మెటా ప్రకటించింది. ఇప్పటికే చాలా మందికి ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా.. త్వరలో మిగిలిన వారందరికీ అందుబాటులోకి రానుంది. ఒకవేళ మీరు వాట్సాప్ అప్‌డేట్ చేసుకోకపోయి ఉంటే.. లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ అవ్వండి. అప్పుడు మీకూ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
ETV Bharat Telugu : వాట్సాప్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌లో ఇప్పటికే ప్రధాని మోదీ సహా కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ ప్రముఖులు, పలు మీడియా సంస్థల ఛానెళ్లు చేరాయి. తాజాగా 'ఈటీవీ భారత్' సైతం తన వాట్సాప్ ఛానెల్‌ను ప్రారంభించింది. మెరుపు వేగంతో బ్రేకింగ్ న్యూస్, కళ్ల ముందే సమగ్ర సమాచారం, లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ ఈటీవీ భారత్ తెలుగు వాట్సాప్ పై క్లిక్ చేసి ఛానల్‌ను ఇప్పుడే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్, కుటుంబసభ్యులకు షేర్ చేసి.. తాజా వార్తలను ఎప్పటికప్పుడు అర చేతిలో అందించండి.
ఇలా ఫాలో అవ్వండి.. : వాట్సాప్‌ను మీరు అప్‌డేట్ చేసి ఉంటే.. అప్పుడు మీకు ఛానెల్స్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఛానల్స్ ఫీచర్ వచ్చాక మీకు ఇదివరకు కనిపించిన స్టేటస్ ట్యాబ్ స్థానంలో అప్‌డేట్స్ అని కనిపిస్తుంది. అక్కడ పైభాగంలో స్టేటస్‌లు, దిగువన ఛానెల్స్ కనిపిస్తాయి. దిగువన మీకు ఫైండ్ ఛానెల్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఛానల్స్ సెర్చింగ్‌లో ఈటీవీ భారత్ తెలుగు అని ఆంగ్లంలో (ETV Bharat Telugu) టైప్ చేసి పక్కనే ఉన్న ప్లస్ (+) సింబల్ క్లిక్ చేయడం ద్వారా ఛానెల్‌ను ఫాలో అవ్వొచ్చు.
Modi Whatsapp Channel : వాట్సాప్ ఛానెల్లోకి మోదీ ఎంట్రీ.. కొత్త పార్లమెంట్లో ఫొటోతో పోస్ట్
అసలు వాట్సాప్ ఛానల్ అంటే ఏంటంటే..? ఇన్ని రోజుల వరకు మనం వాట్సాప్‌ను పరస్పర కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగించేవాళ్లం. ఆ తర్వాత అందులో గ్రూప్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఛానల్స్ అనే ఫీచర్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ట్విటర్, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో చేస్తామో.. ఇందులోనూ అచ్చం అలాగే మనకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను అనుసరిస్తూ వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ తెలుసుకోవచ్చన్న మాట.
Telangana CMO WhatsApp Channel : తెలంగాణ సీఎం కార్యాలయం (సీఎంవో) సైతం బుధవారం తన వాట్సప్ ఛానల్ ప్రారంభించింది. దీని ద్వారా ప్రభుత్వం, సీఎంవో నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని వెల్లడించింది.
మీరూ క్రియేట్ చేసుకోవచ్చు.. : వాట్సాప్ తెచ్చిన ఈ కొత్త ఛానెల్స్ ఫీచర్ ద్వారా వ్యక్తులు సైతం తమ సొంత ఛానెల్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఛానెల్స్ పక్కనే ఉన్న ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే.. క్రియేట్ ఛానెల్ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత డీపీ, ఛానెల్ పేరు, ఛానెల్ డిస్క్రిప్షన్ పేర్కొని సింపుల్‌గా ఛానెల్ క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే మీ ఛానల్‌ను ఓపెన్ చేసి.. నచ్చిన వారికి ఆ లింక్‌ను షేర్ చేసుకోండి.
WhatsApp Pay India News : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై నేరుగా యాప్‌లోనే పేమెంట్స్!
WhatsApp Channel Creation : వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయాలా?... ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!