ETV Bharat / bharat

మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు - ఈడీ

మనీలాండరింగ్​ కేసులో జమ్ముకశ్మీర్​ మాజీ సీఎం, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీకీ ఈడీ సమన్లు జారీ చేసింది. మార్చి 15న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని అధికారులు ఆమెకు సూచించారు.

ED-MEHBOOBA-SUMMONS
మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు
author img

By

Published : Mar 5, 2021, 8:23 PM IST

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. మార్చి 15న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని అధికారులు ఆమెకు సూచించారు.

మెహబూబా ముఫ్తీ 2016 నుంచి 2018 వరకు జమ్ముకశ్మీర్‌ సీఎంగా పనిచేశారు. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దుచేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని వ్యతిరేకించిన ఆమె గృహనిర్బంధానికి గురయ్యారు. దాదాపు 14 నెలల తర్వాత గతేడాది అక్టోబర్‌లో నిర్బంధం నుంచి బయటకు వచ్చారు. అనంతరం కశ్మీర్‌లో తన రాజకీయ ప్రత్యర్థి అయిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, తదితర పక్షాలతో కలిసి పీపుల్స్‌ ఆలియన్స్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌లో చేరారు.

ఇదీ చూడండి: సినీప్రముఖులపై ఐటీ దాడులు.. రూ.650 కోట్ల అక్రమాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.