జమ్ము కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని పెథ్సీర్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఎన్కౌంటర్ ప్రారంభం కాగా.. మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్.. ఎన్కౌంటర్కు దారితీసిందని అధికారులు తెలిపారు.
మంగళవారం ఉదయం బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ప్రతిదాడుల్లో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టామని వెల్లడించారు. మృతులు ఏ సంస్థకు చెందినవారనే వివరాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు.
కాగా, తాజా ఎన్కౌంటర్తో ఈ ఏడాది మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 100 దాటిందని కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
ఉగ్ర స్థావరం గుట్టు రట్టు
![Assam Rifles busted a hideout and recovered arms](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12861960_e9ieljpwuayyk-4-3.jpg)
మరోవైపు, బందిపొరా, నాగ్మార్గ్ అటవీ ప్రాంతంలోని ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ధ్వంసం చేసింది భారత ఆర్మీకి చెందిన అసోం రైఫిల్స్. భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఇందులో 10 యూబీజీఎల్ గ్రెనేడ్లు, రెండు చైనా గ్రెనేడ్లు ఉన్నట్లు తెలిపింది.
![Assam Rifles busted a hideout and recovered arms](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12861960_e9ieljpwuayyk-4-2.jpg)
![Assam Rifles busted a hideout and recovered arms](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12861960_e9ieljpwuayyk-4-1.jpg)
ఇదీ చదవండి: అఫ్గాన్ కోసం భారత్ 'ఆపరేషన్ దేవీ శక్తి'