ETV Bharat / bharat

కూలీ​కి దొరికిన భారీ డైమండ్​.. రాత్రికి రాత్రే లక్షాధికారిగా! - మధ్యప్రదేశ్​ పన్నా గనులు

విలువైన వజ్రం దొరకడం వల్ల ఓ కూలీ రాత్రికి రాత్రి లక్షాధికారిగా మారాడు. మధ్యప్రదేశ్​లో పన్నాలో జరిగిందీ ఘటన.

emerald-land-made-dhanna-seth-a-labour-diamond-worth-10-lakhs-found-in-mine

author img

By

Published : Dec 24, 2022, 4:37 PM IST

భారత్​లోనే కాదు ఖండాల్లోనూ విలువైన వజ్రాలకు ప్రఖ్యాతి గాంచిన మధ్యప్రదేశ్​లోని పన్నాలో మరో అరుదైన వజ్రం బయటపడింది. లీజుకు తీసుకున్న గనిలో విలువైన వజ్రం దొరకడం వల్ల ఓ కూలీ రాత్రికి రాత్రి లక్షాధికారిగా మారాడు.
రాణీబాగ్​కు చెందిన రూపేశ్​ కుష్వాహా అనే కూలీ.. ఇటీవలే గనిని లీజుకు తీసుకున్నాడు. శనివారం అతడి పంట పండింది. 3.1 క్యారెట్ల విలువైన వజ్రం రూపేశ్​కు దొరికింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ వజ్రాన్ని పన్నాలోని డైమండ్ ఆఫీస్​లో డిపాజిట్ చేసినట్లు రూపేశ్ చెప్పాడు. వేలం ద్వారా వచ్చిన డబ్బును తన భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఉపయోగిస్తానని చెప్పాడు.

రూ.10లక్షలు..
త్వరలో జరగనున్న వజ్రాల వేలంలో ఈ వజ్రాన్ని ఉంచుతామని పన్నా డైమండ్​ ఆఫీసు అధికారులు తెలిపారు. వేలంలో ఈ వజ్రం సుమారు రూ.10 పలుకుతుందని అంచనా వేస్తున్నారు. రూపేశ్​కు దొరికిన వజ్రం మంచి నాణ్యత కలిగి ఉందని తెలిపారు.

మధ్యప్రదేశ్​లోని పన్నా.. వజ్రాల గనులకు ప్రసిద్ధి. అనేక మంది ఆ ప్రాంతంలో భూమిని లీజుకు తీసుకుని, ప్రభుత్వ అనుమతితో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతుంటారు. గనుల్లో దొరికిన వజ్రాల్ని డైమండ్ ఆఫీస్​లో డిపాజిట్ చేసి, అధికారుల సమక్షంలో వేలం వేయిస్తారు. అయితే.. ఆ ప్రాంతంలో ఎవరికైనా తమ పొలాల్లో ఏదైనా విలువైన వజ్రం లేదా రాయి దొరికితే ప్రభుత్వం వాటి విలువలో 12.5 శాతం వాటా ఇస్తుంది. కానీ కొంత మంది తమకు గనుల్లో దొరికిందని, ఆ వస్తువు తమదే అని వాదిస్తారు. ఒకవేళ ఈ విషయం కోర్టుకు వెళ్తే తీర్పు గని యజమానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఒక వేళ డైమండ్​ దొరికిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయకుండా దాచితే వారిపై చర్యలు​ తీసుకోవచ్చని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.