ETV Bharat / bharat

గజరాజు వీరంగం- వ్యక్తి పరిస్థితి విషమం

ఝార్ఖండ్​లోని రాంచీలో ప్రజలను భయాందోళనలకు గురిచేసింది ఓ ఏనుగు. ఓ గ్రామంలోకి చొరబడి ఇళ్ల గోడలు బద్దలుకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, అతడి పరిస్థితి విషమంగా ఉంది.

elephant enter in pithoriya village in ranchi
గజరాజు వీరంగంతో వ్యక్తి పరిస్థితి విషమం
author img

By

Published : Mar 28, 2021, 2:38 PM IST

ఝార్ఖ్ండ్​లో ఓ ఏనుగు భీభత్సం సృష్టించింది. రాంచీ జిల్లా కాన్కే గ్రామంలోని ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చివేసింది.

రాంచీలో భీభత్సం సృష్టించిన ఏనుగు

ఏనుగును అడవిలోకి పంపించడానికి అటవీ అధికారులు, గ్రామంలోని యువత విఫలయత్నం చేశారు. అయితే అది గ్రామంలోకి దూసుకొచ్చి దాడి చేయడం మొదలుపెట్టింది. ఏనుగును అదుపు చేసే క్రమంలో ఓ యువకుడు దానికి చిక్కాడు. అతడిని తొండంతో ఈడ్చి పడేయగా.. తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: లోదుస్తుల్లో రూ.40 లక్షల బంగారం​- మహిళ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.