ETV Bharat / bharat

మినీ సార్వత్రికంలో ఓటరు తీర్పు ఏంటి? - కేరళ ఎన్నికల కౌంటింగ్

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు లెక్కింపు చేపట్టనుండగా గంటల్లోనే గెలుపోటముల సరళి తెలిసే అవకాశాలున్నాయి. అసోం, కేరళల్లో ప్రస్తుత కూటములే అధికారం నిలబెట్టుకునే అవకాశాలున్నాయన్న ఎగ్జిట్‌పోల్స్‌.. తమిళనాడు, పుదుచ్చేరిలో మార్పు తప్పకపోవచ్చని అంచనా వేశాయి. హోరాహోరీ పోరు జరిగిందని భావిస్తున్న బంగాల్‌పైనే అందరి దృష్టి నెలకొంది.

ELECTIONS
మినీ సార్వత్రికంలో ఓటరు తీర్పు ఏంటి?
author img

By

Published : May 2, 2021, 5:36 AM IST

Updated : May 2, 2021, 6:54 AM IST

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల తుది ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గంటల వ్యవధిలోనే ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు ఏ మేరకు నిజమవ్వనున్నాయి? ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకునేది ఎవరు? అనే విషయాలు నేడు తేలిపోనున్నాయి.

మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకుగాను 2.7 లక్షల పోలింగ్​ కేంద్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో.. 18.68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తమిళ పోరు...

తమిళనాట డీఎంకే, ఏఐడీఎంకే కూటమి మధ్య ద్విముఖపోరు నడిచింది. మళ్లీ తామే అధికారాన్ని చేపడతామని ఏఐఏడీఎంకే ధీమాగా ఉండగా.. మరోవైపు.. ఈసారి తమిళ ఓటర్లు తమకే పట్టం కడతారని డీఎంకే విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో కమలహాసన్​, దినకరన్​ వంటి వారు ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: తమిళ పోరు: కౌంటింగ్​కు వేళాయెరా

234 సీట్లకు ఏప్రిల్​ 6న ఒకే విడతలో పోలింగ్​ జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 118 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది.

tn exit polls
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్

తమిళనాడులో డీఎంకే ప్రభంజనం సృష్టించనుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే.. అధికార పీఠాన్ని అధిరోహించనుందని వెల్లడించాయి.

బంగాల్ దంగల్​​..

294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో సాగిన బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది.. సర్వత్రా ఆసక్తిగా మారింది. అధికార టీఎంసీ- విపక్ష భాజపా మధ్య జరిగిన హోరాహోరీ పోరుకు యావత్​ దేశం సాక్ష్యంగా నిలిచింది.

ఇదీ చదవండి: బంగాల్​ దంగల్​లో విజేత ఎవరు?

బంగాల్​లో ఏ పార్టీ అయినా.. అధికారాన్ని చేపట్టేందుకు 148 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

wb exit polls
బంగాల్ ఎగ్జిట్ పోల్స్

బంగాల్​ గడ్డపై టీఎంసీ మూడోసారి అధికారం.. నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కేరళ సమరం..

కేరళలో ఎల్​డీఎఫ్, ​యూడీఎఫ్​ హోరాహోరీ పోరులో అంతిమవిజయం ఎవరిదనేది ఆదివారం తేలనుండగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ఈ రెండు కూటములు​ ధీమాగా ఉన్నాయి.

ఇదీ చదవండి: కేరళ సమరం- కౌంటింగ్​కు సర్వం సిద్ధం

మొత్తం 140 అసెంబ్లీ ఎన్నికలకు ఒక విడతలో పోలింగ్​ జరగ్గా.. 957మంది ఎన్నికల బరిలో నిలిచారు.

kerala exit polls
కేరళ ఎగ్జిట్ పోల్స్

కేరళలో మరోమారు పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ కూటమే.. అధికారాన్ని హస్తగతం చేసుకోనున్నట్లు విడుదలైన అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

అసోం పోరు...

​భాజపా-ఏజీపీ, కాంగ్రెస్‌ మహాకూటమి, అసోం జాతీయ పరిషత్‌ మధ్య ప్రధానంగా పోటీ సాగిన ఈశాన్య రాష్ట్రం అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి.

ఇదీ చదవండి: అసోంలో అధికార పీఠం దక్కేదెవరికి?

126 స్థానాలున్న అసోం శాసనసభకు మూడు విడతల్లో.. మార్చి 27, ఏప్రిల్‌ 1, 6 తేదీల్లో పోలింగ్‌ జరిగింది. ఇక్కడ ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 64 స్థానాలు సాధించాల్సి ఉంటుంది.

assam exit polls
అసోం ఎగ్జిట్ పోల్స్

అసోంలో.. భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారం చేపడుతుందని ఎగ్జిట్​పోల్​ ఫలితాలు విడుదల చేసిన సర్వే సంస్థలు ప్రకటించాయి. అయితే.. అధికార కూటమికి ఈసారి గతం కంటే కొన్ని స్థానాలు తగ్గనున్నట్లు వెల్లడించాయి.

పుదుచ్చేరి పోరు..

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో.. మొత్తం 30 స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 6న పోలింగ్ జరిగింది. ఇక్కడ ఏ పార్టీ అధికారాన్ని చేపట్టాలన్నా.. 16 స్థానాలు సాధించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: పుదుచ్చేరి పోరు: తుది ఘట్టానికి సర్వం సిద్ధం

పుదుచ్చేరిలో ఎన్​డీఏ అధికారం చేపట్టే అవకాశం ఉందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. అన్నాడీఎంకే, భాజపా, రంగస్వామి కాంగ్రెస్‌ పార్టీలు ఇక్కడ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.

Last Updated : May 2, 2021, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.