నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు.. పంజాబ్ నుంచి 38 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వారిలో తొమ్మిది మంది అధికారులు సోమవారం కరోనా టీకా తీసుకున్నట్లు పంజాబ్ ఎన్నికల అధికారి తెలిపారు.
బంగాల్లో 8 విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. అసోంలో 3 దశల్లో నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికలు మార్చి 27న మొదలై.. ఏప్రిల్ 29న ముగియనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇదీ చదవండి: సైకత శిల్పంతో మహిళలకు శుభాకాంక్షలు