Election Business Online Campaign Effect : మారుతున్న కాలంతోపాటు ఎన్నికల ప్రచారం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. బహిరంగ సభలు, ర్యాలీలకు తోడు.. సామాజిక మాధ్యమాలు ఎన్నికలపై గట్టి ప్రభావం చూపుతున్నాయి. యువత ఎక్కువ సమయం ఫోన్లలోనే సమయం కేటాయిస్తున్నారు కాబట్టి.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు.. పార్టీలు కూడా సామాజిక మాధ్యమాలను ప్రచారానికి వేదికగా చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారం డిజిటల్ బాటపట్టడంతో పార్టీల జెండాలు, టోపీలు, టీషర్టులు, కీచైన్‌లు, కండువాలు, బెలూన్లు వంటివాటిని అమ్మే వ్యాపారాలకు గిరాకీ బాగా తగ్గిపోయింది.
'సగం కూడా అమ్మలేకపోతున్నాం..'
Social Media Campaign effect Election Business : మధ్యప్రదేశ్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో తమ వ్యాపారాలు ఉచ్ఛస్థితిలో ఉంటాయనీ.. కానీ ఈ సారి అది చాలా వరకు తగ్గిపోయిందని ఎన్నికల జెండాలు ఇతరత్రాలను అమ్మే వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సగం కూడా అమ్మలేకపోతున్నామని తెలిపారు.
"సోషల్ మీడియా ప్రభావంతో మా వ్యాపారంలో దాదాపు 80 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు రూ.100 వచ్చే వ్యాపారంలో ఇప్పుడు కేవలం రూ. 20 మాత్రమే వస్తున్నాయి. ఇలాంటి పీక్ సీజన్‌లో మాట్లాడటానికి కూడా సమయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు గిరాకీ లేక మౌనంగా కూర్చున్నాము. సోషల్ మీడియా ఇక్కడ చాలా ప్రభావం చూపింది."
-అజయ్ అగర్వాల్, వ్యాపారి"ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వార్తలు చాలా త్వరగా ప్రజలకు చేరుతున్నాయి. మొబైల్స్, ఎలక్ట్రానిక్ మీడియా కారణంగా మా వ్యాపారంపై పెద్ద ప్రభావం పడింది."
-గులాబ్‌రావ్ పవార్, వ్యాపారి
'సామాజిక మాధ్యమాల వల్లే కాకపోవచ్చు..'
ప్రజలంతా కొత్తదనం కోసం చూస్తారనీ ఇది కూడా అందుకు మినహాయింపు కాదని వ్యాపారులు చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం సామాజిక మాధ్యమాల వల్లే తమ వ్యాపారం దెబ్బతింటుందని చెప్పలేమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈసీ, ఇన్‌కం టాక్స్‌కు భయపడి ఎన్నికల అభ్యర్థులు.. ప్రచారంలో ఎన్నికల సామాగ్రిపై డబ్బును తక్కువగా ఖర్చు చేస్తుండటం కూడా కారణం కావచ్చని తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రచారంలో అయోధ్య వేడి!
ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధితో పాటు ఇతర అంశాలూ ప్రచారంలో హాట్ టాపిక్‌గా మారాయి. అయోధ్య రామ మందిరం నిర్మాణ విషయం మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాక పుట్టిస్తోంది. ఆ రాష్ట్రంలో రామ మందిర విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ప్రచారంలో కాంగ్రెస్ తగ్గేదేలే- ఉచిత హామీలతో ఓటర్లలో ఫుల్ జోష్, డైలమాలో బీజేపీ!