జమ్ముకశ్మీర్ యంత్రాంగం విద్యాసంస్థలను తెరిచే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసే ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే.. 9 నుంచి 12 వ తరగతికి చెందిన విద్యార్థులు స్వచ్ఛందంగా పాఠశాలలకు రావొచ్చని తెలిపింది. ఆన్లైన్ విద్యను యథావిధిగా కొనసాగించవచ్చని జమ్ముకశ్మీర్ యంత్రాంగం తెలిపింది.
ఉత్తర్వుల్లోని కీలకాంశాలు..
- వివాహ వేడుకల్లో 100 మంది అతిథులు మాత్రమే పాల్గొనాలి.
- థియేటర్లను 50శాతం సామర్థ్యంతో తెరుచుకోవచ్చు.
- ఆన్లైన్ విద్య కోసం పాఠశాలలకు ఉపాధ్యాయ, ఉపాధ్యేయతర సిబ్బంది 50 శాతం వరకు హాజరుకావచ్చు.
- ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే శిక్షణా సంస్థలు తెరిచే ఉంటాయి.
- శాస్త్ర, సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న పీజీ, రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు తమ విద్యాసంస్థల్లో ప్రయోగశాలల కోసం హాజరుకావచ్చు.
- కంటెయిన్మెంట్ జోన్లేని ప్రాంతాల్లో 100 మందితో సభలు, సమావేశాలు జరుపుకోవచ్చు.
- ప్రార్థన మందిరాలు తెరిచే ఉంటాయి. కానీ, భారీ సంఖ్యలో జనంతో మత సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు.
- ప్రయాణికులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. కానీ, తప్పనిసరిగా కొవిడ్ యాంటీజెన్ పరీక్షలను చేయించుకోవాలి.
ఇదీ చూడండి:నేడు మరో మూడు సంస్థలతో మోదీ భేటీ- టీకాపై ఆరా