ETV Bharat / bharat

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత లబ్ధి కోసమే ఇదంతా: ఈడీ - దిల్లీ మద్యం కేసులో రామచంద్రపిళ్లైను అరెస్ట్ ఈడీ

Delhi Liquor Scam Case Updates: దిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. ఎమ్మెల్సీ కవితకు లబ్ధి కలిగించేందుకు అన్నీ తానై అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ మొత్తాన్ని అరుణ్ పిళ్లై దగ్గరుండి నడిపించారని నివేదికలో పేర్కొంది.

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత లబ్ధి కోసమే ఇదంతా: ఈడీ

author img

By

Published : Mar 7, 2023, 5:07 PM IST

Updated : Mar 7, 2023, 5:34 PM IST

Delhi Liquor Scam Case Updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో హైదరాబాద్​కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక అరుణ్ పిళ్లైకు దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అయితే అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ఈడీ బయట పెట్టింది. 17 పేజీలతో అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టు రూపొందించింది.

MLC Kavitha in Delhi Liquor Scam Case ఆ నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. ఈ దిల్లీ మద్యం కుంభకోణం... ఎమ్మెల్సీ కవితకు లబ్ధి కలిగించేందుకు అన్నీ తానై అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ మొత్తాన్ని అరుణ్ పిళ్లై దగ్గరుండి నడిపించారని నివేదికలో ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూపులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారని తెలిపింది. సౌత్ గ్రూపులో అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ రెడ్డి సహా... వైసీపీ ఎంపీ మాగుంట, కుమారుడు రాఘవ్ ఉన్నారని వివరించింది. సౌత్‌ గ్రూపు ప్రతినిధులు అరుణ్ పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు ఉన్నట్లు పేర్కొంది.

ED remand Report in Delhi liquor scam ఇక ఇదే కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైకు ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు విధించింది. మార్చి 13 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ వాదనతో ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు... తల్లితో మాట్లాడేందుకు అనుమతినిచ్చింది. కస్టడీలో ఉన్న పిళ్లైని కలిసేందుకు అతని భార్య, బావమరిదికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది.

Delhi Liquor Scam Case ఇదిలా ఉంటే.. ఇదే కేసులో అరెస్టయిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్​ గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ బెయిల్​ మాత్రం నిబంధనలతో కూడి ఉంటుందని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. బెయిల్​ ఇవ్వడానికి రూ.2 లక్షల పూచీకత్తు.. పాస్​పోర్టును జమ చేయాలని చెప్పింది. జ్యుడీషియల్​ కస్టడీని కోరుతూ.. సీబీఐ కోర్టును అనుమతి కోరింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు 14 రోజుల కస్టడీని పొడిగించడం జరిగింది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 7, 2023, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.