ETV Bharat / bharat

మాజీ హోంమంత్రి ఆస్తులు అటాచ్​

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​పై పీఎంఎల్​ఏ చట్టం కింద చర్యలు చేపట్టింది ఈడీ. ఆయనకు చెందిన రూ.4 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్​ చేసింది.

ex-Maha HM Deshmukh
అనిల్​ దేశ్​ముఖ్​
author img

By

Published : Jul 16, 2021, 3:48 PM IST

మనీలాండరింగ్​ కేసులో భాగంగా మాహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​కు చెందిన రూ.4 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్​ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. మనీలాండరింగ్​ నిరోధక చట్టం(పీఎంఎల్​ఏ) కింద చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

దేశ్​ముఖ్​ రాజీనామాకు దారితీసిన రూ.100 కోట్ల లంచం ఆరోపణలపై ఈడీ క్రిమినల్​ కేసు నమోదు చేసింది. విచారణ కోసం తమ ముందుకు రావాలని మూడుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన హాజరుకాలేదు​. ఆయన భార్య, కుమారుడు హృశికేశ్​కు సైతం సమన్లు అందినప్పటికీ.. వారూ స్పందించలేదు.

తనపై వచ్చిన ఆరోపణలను ఇటీవల ఖండించారు దేశ్​ముఖ్​. ఈడీ చేపట్టే చర్యల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఇదీ చూడండి: అనిల్​ దేశ్​ముఖ్​పై ఈడీ క్రిమినల్​ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.