Earthquake In Jaipur : రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. . ఉదయం 4 గంటల సమయంలో తొలి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4 గా నమోదైంది. ఆ తరువాత 20 నిమిషాలకు 3.1 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. మరో 5 నిమిషాల వ్యవధిలో 3.4 తీవ్రతతో మూడో భూకంపం నమోదైంది. జైపుర్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.
-
Another earthquake of Magnitude 3.4 strikes Jaipur, Rajasthan: National Center for Seismology
— ANI (@ANI) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
This is the 3rd earthquake that has struck Jaipur in an hour pic.twitter.com/zUoHX4Vwcz
">Another earthquake of Magnitude 3.4 strikes Jaipur, Rajasthan: National Center for Seismology
— ANI (@ANI) July 20, 2023
This is the 3rd earthquake that has struck Jaipur in an hour pic.twitter.com/zUoHX4VwczAnother earthquake of Magnitude 3.4 strikes Jaipur, Rajasthan: National Center for Seismology
— ANI (@ANI) July 20, 2023
This is the 3rd earthquake that has struck Jaipur in an hour pic.twitter.com/zUoHX4Vwcz
Earthquake Today Jaipur : గాఢనిద్రలో ఉన్నప్పుడు భూమి ఒక్కసారిగా కంపించడం వల్ల ప్రజలంతా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. కొంతమంది వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఈ భూకంపం గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. జైపుర్‌తో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో సైతం భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. 'గంటలో మూడు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. నా కుటుంబం మొత్తం నిద్రలోంచి లేచాం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు' అని స్థానికుడు వికాస్ తెలిపాడు.
-
Rajasthan | An earthquake of Magnitude 4.4 strikes Jaipur
— ANI (@ANI) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(CCTV Visuals)
(Video source - locals) pic.twitter.com/MOudTvT8yF
">Rajasthan | An earthquake of Magnitude 4.4 strikes Jaipur
— ANI (@ANI) July 20, 2023
(CCTV Visuals)
(Video source - locals) pic.twitter.com/MOudTvT8yFRajasthan | An earthquake of Magnitude 4.4 strikes Jaipur
— ANI (@ANI) July 20, 2023
(CCTV Visuals)
(Video source - locals) pic.twitter.com/MOudTvT8yF
Earthquake In Manipur : గురువారం తెల్లవారుజామున ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపుర్లో కూడా భూకంపం సంభవించింది. మిజోరాంలోని నొగోపాలో సైతం 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. మణిపుర్‌లోని ఉఖ్రుల్లో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.
-
#WATCH | Jaipur: The tremors were strong, and my whole family woke up...no injuries: Vikas, a local, on the earthquake https://t.co/hCFUQuquwV pic.twitter.com/KLGohUkleI
— ANI (@ANI) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Jaipur: The tremors were strong, and my whole family woke up...no injuries: Vikas, a local, on the earthquake https://t.co/hCFUQuquwV pic.twitter.com/KLGohUkleI
— ANI (@ANI) July 20, 2023#WATCH | Jaipur: The tremors were strong, and my whole family woke up...no injuries: Vikas, a local, on the earthquake https://t.co/hCFUQuquwV pic.twitter.com/KLGohUkleI
— ANI (@ANI) July 20, 2023
-
An earthquake of magnitude 3.5 on Richter scale hits Manipur's Ukhrul: National Center for Seismology pic.twitter.com/7yFvtNba0i
— ANI (@ANI) July 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">An earthquake of magnitude 3.5 on Richter scale hits Manipur's Ukhrul: National Center for Seismology pic.twitter.com/7yFvtNba0i
— ANI (@ANI) July 21, 2023An earthquake of magnitude 3.5 on Richter scale hits Manipur's Ukhrul: National Center for Seismology pic.twitter.com/7yFvtNba0i
— ANI (@ANI) July 21, 2023
Earthquake In Delhi : గత నెలలో దిల్లీ సహా ఉత్తరాదిలో స్వల్ప భూకంపం సంభవించింది. జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్కు 8 కిలోమీటర్ల దూరంలో.. 6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం అధికారులు తెలిపారు. డోడ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ విభాగం అధికారులు వెల్లడించారు. దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఛండీగఢ్ పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉన్నట్లు అధికారులు వివరించారు. దీంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగెత్తారు. శ్రీనగర్‌లో స్కూల్లోని పిల్లలు, దుకాణాల్లో ప్రజలు భయంతో బయటకు పరిగెత్తారని.. స్థానికులు తెలిపారు. భకంప ధాటికి డోడా జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సీలింగ్ కూలిపోయింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.