ETV Bharat / bharat

తాగుబోతు కోడిపుంజు.. మందు లేనిదే ముద్ద ముట్టదట! - కోడిపుంజు వార్తలు

మద్యానికి బానిసైన మనుషులను చూసి ఉంటారు. కానీ, మందుకు బానిసైన కోడిని ఎప్పుడైనా చూశారా? ఓ కోడి పుంజు ప్రతి రోజు మందు తాగనిదే ధాన్యం గింజ కూడా ముట్టటం లేదంటే నమ్ముతారా? అవునండీ.. మీరు విన్నది నిజమే. ఓ కోడి పుంజు మందు లేనిదే ముద్ద ముట్టటం లేదు. మరి ఆ కోడిపుంజు సంగతులేంటో తెలుసుకుందాం?

drunken rooster
తాగుబోతు కోడి
author img

By

Published : Jun 4, 2022, 4:03 PM IST

Updated : Jun 4, 2022, 9:01 PM IST

తాగుబోతు కోడిపుంజు

కోళ్లకు ఆహారంగా ధాన్యం గింజలు వేస్తారు. పందేకోళ్లకైతే బాదం, పిస్తా వంటివి పెడతారని తెలుసు. కానీ, ఓ కోడిపుంజుకు ప్రతిరోజు మద్యం పట్టాల్సి వస్తోంది. మందు లేనిదే ముద్ద ముట్టటం లేదు. లిక్కర్​ అందిస్తేనే ధాన్యం గింజలను తింటుంది, నీళ్లు తాగుతుంది. మహారాష్ట్ర, భందారా జిల్లాలోని ఆ కోడి పుంజు కథేంటో మనమూ తెలుసుకుందాం పదండి.

భందారా నగరానికి సమీపంలోని పునరావాస గ్రామం పిప్రీకి చెందిన భావు కాతోరే అనే వ్యక్తికి కోళ్ల పెంపకంపై ఆసక్తి ఎక్కువ. వివిధ రకాల జాతుల కోళ్లను పెంచుతున్నారు. అందులోని ఓ కోడిపుంజు వారి కుటుంబంలోని ఒకరిగా కలిసిపోయింది. ఇంట్లోని వారందరూ దానిని ఇష్టంగా చూసుకుంటారు. కానీ, దాని చెడు అలవాట్ల వల్ల ఆందోళన చెందుతున్నారు. ఆ కోడిపుంజు కొన్ని నెలలుగా మద్యానికి బానిసైంది. అంతే కాదు.. మందు ముట్టనిదే ఆహారం తీసుకోదు. కనీసం మంచి నీళ్లు సైతం ముట్టుకోదంటే నమ్మండి. దీంతో ప్రతి రోజు మద్యం కొనుగోలు చేసి దానిని పట్టిస్తున్నారు భావు కాతోరే.

మద్యానికి ఎలా అలవాటైంది?: కోడిపుంజు గత ఏడాది అనారోగ్యానికి గురైంది. దాంతో దగ్గరుండి ఆహారం, నీళ్లు అందించాల్సి వచ్చింది. కోడిపుంజు బతకాలంటే స్థానికంగా దొరికే లిక్కర్​ పట్టించాలని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు. కానీ, స్థానికంగా తయారు చేసే లిక్కర్​ లేకపోవటం వల్ల విదేశీ మద్యం ఇవ్వటం మొదలు పట్టారు భావు కాతోరే. కొద్ది రోజులకే అనారోగ్యం నుంచి కోలుకుంది. కానీ, మద్యానికి బానిసైంది. అప్పటి నుంచి మందు లేనిదే కనీసం నీళ్లు కూడా తాగటం లేదు. కోడిపుంజు మద్యం కోసం ప్రతినెల రూ.2వేలు ఖర్చు చేస్తున్నారు భావు కాతోరే. మద్యం మాన్పించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. ఆల్కహాల్​లా వాసన వచ్చే విటమిన్​ ట్యాబ్లెట్లు ఇవ్వటం ప్రారంభించాలని పశువైద్యులు సూచించారు. దాంతో ఖర్చు తక్కువవటమే కాకుండా.. మందు మానుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: ఇత్తడి బిందెలో ఇరుక్కున్న బాలుడు.. ఇనుప గ్రిల్స్​లో మరో చిన్నారి...

'స్పైడర్ మ్యాన్' సాహసాలతో వరుస చోరీలు.. అడ్డంగా కెమెరాకు చిక్కి..!

Last Updated : Jun 4, 2022, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.