Drugs Seized In Rajasthan: రాజస్థాన్ బాడ్మేర్ ప్రాంతంలోని భారత్- పాకిస్థాన్ సరిహద్దులో 14 కేజీల 740 గ్రాముల హెరాయిన్‌ను ఎస్ఓజీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ. 35 కోట్లకుపైనే ఉంటుందని అంచనావేశారు. ఈ హెరాయిన్ బాడ్మేర్ సరిహద్దులోని పొదల్లో దొరికినట్లు చెప్పారు. పాకిస్థాన్ గుండా భారత్‌లోకి ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై గద్రా రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇలాంటి ఘటనే ఇటీవల పంజాబ్‌లోనూ జరిగింది.
భారత్‌లోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న పాక్ ముఠాను అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది. స్మగ్లర్లపై కాల్పులు జరిపి తరిమికొట్టారు. 47 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ గురుదాస్‌పుర్‌లోని చందూ వదాలా పోస్ట్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాను గాయపడ్డారు.
ఇదీ చూడండి: తప్పతాగి తమ్ముడి భార్యపైనే.. ఇంట్లో ఎవరూ లేరని..