వలపు వలలో చిక్కుకుని పాకిస్థాన్‌కు దేశ రహస్యాలు చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డ్రైవర్‌గా పనిచేసే ఓ వ్యక్తి పాక్ వలపు వలలో చిక్కుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే అతడ్ని పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థ.. ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ హనీట్రాప్ చేసిందని తెలిపారు. పక్కా సమాచారంతో దిల్లీ పోలీసులు.. భద్రతా దళాల సాయంతో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి:
కంపెనీలకు షాక్! సమాచార దుర్వినియోగానికి పాల్పడితే.. రూ.500 కోట్లు జరిమానా
ఎన్ని చిత్రహింసలు పెట్టినా అక్కడే! అతడిపై 'ప్రేమ'కు బలైపోయిన శ్రద్ధ!