ETV Bharat / bharat

పేపర్​ కప్పులో టీ తాగుతున్నారా? జర జాగ్రత్త

పర్యావరణ హితమని పేపర్​ కప్పులో టీ తాగుతున్నారా..? అయితే జాగ్రత్తపడండి. వాటిల్లోనూ ప్లాస్టిక్​ రేణువులు ఉంటాయని, అవి ఆరోగ్యానికి హానికరమని ఓ ఐఐటీ అధ్యయనం చెప్తోంది. ఒక పేపర్​ కప్పులో సుమారు 25వేల మైక్రో ప్లాస్టిక్​ కణాలు ఉంటాయని అందులో స్పష్టం చేశారు పరిశోధకులు.

tea cup news
పేపర్​ కప్పులో టీ తాగుతున్నారా? జర జాగ్రత్త
author img

By

Published : Nov 9, 2020, 6:00 AM IST

Updated : Nov 9, 2020, 7:46 AM IST

ప్లాస్టిక్​ కప్పులో టీ తాగితే హానికరమని తెలుసు. అందుకే వాటికి ప్రత్యామ్నాయంగా ఒకసారి వాడిపారేసే(డిస్పోజబుల్​) పేపర్​ కప్పుల్ని విరివిగా వినియోగిస్తున్నాం. అయితే ఈ పేపర్​ కప్పుల్లో టీ తాగినా హానికరమేనని ఖరగ్​పుర్​ ఐఐటీ అధ్యయనంలో తేలింది.

"పేపర్​ కప్పుల్లో వేడి ద్రవం పోసినప్పుడు ఆ పేపర్​లోని మైక్రో ప్లాస్టిక్​ కణాలు, ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో కలిసిపోతాయి. సాధారణంగా పేపర్​ కప్పులు హైడ్రోఫోబిక్​ ఫిల్మ్ కలిగిన​ సన్నటి పొరతో తయారవుతాయి. ఇందులోనూ పాలీ ఇథలీన్​(ప్లాస్టిక్​) ఉంటుంది. వేడి ద్రవం పోసిన 15 నిమిషాల్లోపే ఈ మైక్రోప్లాస్టిక్​ లేయర్​లో చర్య జరుగుతుంది" అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన అసోసియేట్​ ప్రొఫెసర్​ సుధాగోయెల్​ చెప్పారు.

85-90 డిగ్రీల సెల్సియస్​ వేడి ఉండే 100 ఎంఎల్​ వేడి ద్రవంలోకి.. పేపర్​ కప్పు నుంచి 25 వేల మైక్రోప్లాస్టిక్​ రేణువులు విడుదలవుతాయి. ఈ రేణువుల్లో అయాన్లతో పాటు క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు ఉంటాయని ఆమె వివరించారు.

Last Updated : Nov 9, 2020, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.