గుజరాత్ ప్రభుత్వంతో కలిసి కేవలం 8 రోజుల్లోనే కొవిడ్ 19 చికిత్సకు ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించింది రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ). మొత్తం 900 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని అహ్మదాబాద్లో పూర్తిచేసింది.

గుజరాత్ విశ్వవిద్యాలయంలోని కన్వెన్షన్ సెంటర్ను ఈ కొవిడ్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. మరో 500 పడకలు జోడించేందుకు కూడా ఇక్కడ సామర్థ్యం ఉందని గుజరాత్ సర్కారు తెలిపింది.

అమిత్ షా రాక..
ఈ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిపై.. సమీక్షించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు (శుక్రవారం) గుజరాత్ వెళ్లనున్నారు.


ఇదీ చూడండి: ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో ప్రధాని కీలక సమావేశం