ETV Bharat / bharat

ఇస్రోకు ఇక సోమ్​నాథ్​ సారథ్యం.. శివన్​కు ఘన వీడ్కోలు

Somanath ISRO: ఇస్రో​ ఛైర్మన్​గా ఎస్​. సోమ్​నాథ్​ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఇస్రో ప్రకటన ద్వారా వెల్లడించింది. సోమ్​నాథ్‌.. ఉపగ్రహ వాహకనౌకల డిజైనింగ్‌లో కీలక పాత్ర పోషించారు.

ISRO New Chairman
ఇస్రో కొత్త ఛైర్మన్​గా సోమనాథ్​ బాధ్యతలు
author img

By

Published : Jan 14, 2022, 6:52 PM IST

Updated : Jan 14, 2022, 7:31 PM IST

Somanath ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రోలో 'సోమ్​నాథ్' శకం ఆరంభమైంది. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ స్పేస్​ కార్యదర్శిగా, స్పేస్​ కమిషన్​ ఛైర్మన్​గా ఎస్​. సోమ్​నాథ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.​ ఈ విషయాన్ని ఇస్రో ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ బాధ్యతలు చేపట్టకముందు విక్రమ్​ సారాభాయ్ స్పేస్​ సెంటర్​ డైరక్టర్​గా సోమ్​నాథ్​ సేవలు అందించారు.

2018 జనవరి నుంచి ఇస్రో ఛైర్మన్​గా వ్యవహరిస్తున్న శివన్​ పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సోమ్​నాథ్​ సారథ్య బాధ్యతలు అందుకున్నారు.

కొల్లంలో టీకేఎం కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన సోమనాథ్‌.. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సైన్స్‌లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో గోల్డ్ మెడల్​ సాధించి మాస్టర్స్‌ పూర్తి చేశారు. అనంతరం 1985లో విక్రమ్‌ సారాభాయ్​ స్పేస్‌ సెంటర్‌లో చేరారు. సోమనాథ్‌.. ఉపగ్రహ వాహక నౌకల డిజైనింగ్‌లో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2014 వరకు జీఎస్‌ఎల్వీ ఎంకే- 3 ప్రాజెక్టు డైరెక్టర్‌గా.. ఉపగ్రహాల అభివృద్ధికి సంబంధించి పలు హోదాల్లో పనిచేశారు.

ఘనతలు..

జీఎస్​ఎల్వీ ఎంకే- 3 అభివృద్ధికి అందించిన సేవలకు గాను సోమ్​నాథ్​ టీమ్​ ఎక్స్​లెన్స్​ అవార్డు అందుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా మెరిట్​ అవార్డ్​, పర్ఫామెన్స్​ ఎక్సలెన్స్​ అవార్డ్​లతో ఇస్రో.. స్పేస్​ గోల్డ్​ మెడల్, నేషనల్​ ఏరోనాటిక్స్​ ప్రైజ్​తో ఆస్ట్రోనాటికల్​ సొసైటీ ఆఫ్​ ఇండియా (ఏఎస్​ఐ) సత్కరించాయి.

ఇంటర్నేషనల్​ ఆస్ట్రోనాటికల్​ ఫేడరేషన్​ బ్యూరోలో సోమ్​నాథ్​ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ఇదీ చూడండి : దళితుడి ఇంట్లో యోగి 'సంక్రాంతి విందు'- వారికి కౌంటర్!

Last Updated : Jan 14, 2022, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.