భారత్లో తొలి ప్రైవేటు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం త్వరలోనే నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకోసం అంతరిక్ష అంకుర పరిశ్రమ 'పిక్సెల్'..ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిప్రకారం వచ్చే ఏడాది ఆరంభంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా దీన్ని కక్ష్యలోకి ప్రవేశపెడతారు.
దేశంలో అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలు పాలుపంచుకోవటానికి వీలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఇన్-స్పేస్' పేరిట ఒక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశాక కుదిరిన ఈ ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. పిక్సెల్ ఉపగ్రహం ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2023 జూన్ నాటికి 30 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పిక్సెల్ తెలిపింది. ఇవి 24 గంటల పాటు భూమిని పరిశీలిస్తుంటాయని పేర్కొంది. వ్యవసాయం నుంచి పట్టణ ప్రణాళిక పర్యవేక్షణ వరకూ అనేక అంశాల్లో సేవలను అందిస్తాయని వివరించింది.
ఇదీ చదవండి : నేడు రైతులతో కేంద్రం మరో దఫా చర్చలు