ETV Bharat / bharat

కరోనాతో నమ్మకం కోల్పోవద్దు: బోబ్డే - కరోనా మహమ్మారి

కరోనా మహమ్మారితో ఎదురైన పరిస్థితులతో నమ్మకం కోల్పోవద్దని, ముందు మంచి రోజులు ఉన్నాయన్నారు సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే. బార్​ కౌన్సిల్​ నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థలో కృత్రిమ మేథ చాలా అవసరమని నొక్కి చెప్పారు.

CJI Bobde
జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే
author img

By

Published : Apr 23, 2021, 10:12 PM IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ బార్​ కౌన్సిల్​ సభ్యుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు పదవీ విరమణ చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ శరద్​ అరవింద్​ బోబ్డే. నమ్మకం కోల్పోవద్దని, పరిస్థితులు మరతాయన్నారు. ముందు ముందు మంచి రోజులు వస్తాయన్నారు.

కరోనా వైరస్​తో చోటు చేసుకున్న మార్పులపై మాట్లాడారు బోబ్డే. ప్రస్తుతం ప్రపంచంలో కృత్రిమ మేధకు చాలా ప్రాముఖ్యత ఉందని నొక్కి చెప్పారు.

"మహమ్మారితో ఎదురైన పరిస్థితులతో కలత చెందిన బార్​ కౌన్సిల్​ యువ సభ్యులకు ఒక్కటే చెబుతున్నా.. నమ్మకం కోల్పోవద్దు. ముందుకు సాగండి, పరిస్థితులు మారతాయి. కృత్రిమ మేథవైపు అడుగులు వేయాలని మేము నిర్ణయించాం. ఆర్టిఫిషియల్​ ఇంటిలిజెన్స్​ను పొందకపోతే.. మనకు చాలా నష్టం జరుగుతుంది. "

- జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే, సీజేఐ

బోబ్డే పదవీ విరమణ చేసిన క్రమంలో ఆయన స్థానంలో 48వ సీజేఐగా జస్టిస్​ ఎన్​వీ రమణ బాధ్యతలు స్వీకరించన్నారు. 'అధునాత సాకేంతికతో న్యాయ వ్యవస్థను మార్పు చేయాలనే లక్ష్యంతో సోదరుడు జస్టిస్​ బోబ్డే అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. అయితే.. కొవిడ్​ మహమ్మారి ఆ ప్రయత్నాలకు అడ్డుపడింది. అయినప్పటికీ బోడ్డే తన నమ్మకాన్ని కోల్పోలేదు' అని గుర్తు చేశారు జస్టిస్​ రమణ

అయోధ్య మధ్యవర్తిత్వంలో షారుఖ్​ ఖాన్​..

అయోధ్య భూమి వివాద మధ్యవర్తిత్వ ప్యానల్​లో బాలీవుడ్​ సూపర్​స్టార్​ షారుఖ్​ ఖాన్​ ఉండాలని జస్టిస్​ బోబ్డే కోరుకున్నట్లు తెలిపారు సుప్రీం కోర్ట్​ బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు వికాస్​ సింగ్​. సీజేఐ విడ్కోలు సమావేశం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఖాన్​ సైతం అందుకు అంగీకరించారని, కానీ అది ఆచరణలోకి రాలేదన్నారు. అయోధ్య విచారణలో జస్టిస్​ బోబ్డే ప్రారంభ స్టేజ్​లో ఉన్నారని, ఆయన మధ్యవర్తిత్వం ద్వారానే సమస్య పరిష్కారం కావాలని కోరుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'సంతృప్తి, జ్ఞాపకాలతో సుప్రీంకోర్టుకు వీడ్కోలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.