ETV Bharat / bharat

'రామ మందిర నిర్మాణానికి రూ.2,500కోట్ల విరాళాలు' - రామ మందిర్​ అప్డేట్స్​

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం.. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 4 వరకే రూ.2,500 కోట్ల విరాళాలు అందినట్లు ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. మొత్తం 4లక్షల గ్రామాల్లో విరాళాల సేకరణ జరగ్గా.. 9లక్షల మంది కార్యకర్తలు పాల్గొన్నారని పేర్కొన్నారు.

Donation of Rs 25,000 million has been collected for Ram Temple construction in Ayodhya
రామ మందిరానికి అప్పటికే రూ.2,500కోట్ల విరాళాలు
author img

By

Published : Mar 6, 2021, 8:52 PM IST

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఫిబ్రవరి 4 నాటికి.. బ్యాంకు వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా రూ.2,500 కోట్ల విరాళాలు వచ్చినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. ఈ మేరకు వివరాలు వెల్లడించిన ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌.. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 27 వరకు రామాలయ సమర్పణ నిధి కార్యక్రమం జరిగినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 'దేశీయ విరాళాలతోనే రామ మందిర నిర్మాణం'

4లక్షల గ్రామాల్లో.. 9లక్షల మంది

దేశంలోని 4 లక్షల గ్రామాల నుంచి విరాళాల సేకరణ జరిగిందని.. అందులో 9 లక్షల మంది కార్యకర్తలు పాల్గొన్నారని చెప్పారు. సేకరించిన నిధులను 38,125 మంది కార్యకర్తలు బ్యాంకుల్లో జమ చేసినట్లు రాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం.. వెబ్‌సైట్ ద్వారా నిధులను సమకూరుతోందని చెప్పారు.

అయితే.. విరాళాల సేకరణలో పారదర్శకత పాటించేలా.. దేశవ్యాప్తంగా 49 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) తెలిపింది. దిల్లీ వేదికగా ఇద్దరు సీఏల పర్యవేక్షణలో 23 మంది నిష్ణాతులైన కార్యకర్తలు మొత్తం విరాళాలపై పని చేస్తున్నారని వెల్లడించింది.

ఇదీ చదవండి: 'అయోధ్య' ఆలయానికి క్రైస్తవులు రూ.కోటి విరాళం

ద్వితీయ స్థానంలో తెలుగు రాష్ట్రం

రామ మందిర నిర్మాణానికి నిధులు సమకూర్చడంలో తెలంగాణ.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని వీహెచ్‌పీ తెలిపింది. విరాళాల వివరాలు పారదర్శకంగా ఉండేలా హైదరాబాద్​కు చెందిన ధనుషా ఇన్ఫో టెక్ కంపెనీ ముఖ్యపాత్ర పోషించిందని పేర్కొంది. అటు.. రామాలయం వద్ద ఇప్పటి వరకు 60శాతం భూమి తవ్వకాల పనులు జరిగాయని.. మార్చి 25నాటికి తవ్వకాల పనులు పూర్తవుతాయన్నారు. వెయ్యేళ్లు నిలిచేలా రామమందిర నిర్మాణం ఉంటుందని.. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్​ల నుంచి ఆలయ నిర్మాణానికి అవసరమైన రాళ్లను ట్రస్టు సేకరిస్తోందని చెప్పారు.

ఇవీ చదవండి: అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు

'2022 తొలినాళ్లలోనే అయోధ్య నుంచి విమాన సేవలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.