ETV Bharat / bharat

బాలుడిని దారుణంగా కరిచిన కుక్క.. మానవత్వం మరిచిన మహిళ - దిల్లీ న్యూస్

Dog Bites Kid In Lift : బాలుడిని కుక్క దారుణంగా కరిచిన ఘటన దిల్లీలో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఆ మహిళా యజమాని తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Dog Bites Kid In Lift
Dog Bites Kid In Lift
author img

By

Published : Sep 6, 2022, 6:31 PM IST

బాలుడిని దారుణంగా కరిచిన కుక్క.. ఏడుస్తున్న పట్టించుకోని మహిళా యజమాని

Dog Bites Kid In Lift : పాఠశాలకు వెళ్లి వస్తున్న ఓ బాలుడిని అతడుండే సొసైటీకి చెందిన ఓ కుక్క కరిచింది. అయితే, బాలుడు బాధతో విలవిల్లాడుతున్నా.. ఎలాంటి జాలి, కరుణలేని ఆ శునకం యజమాని అలాగే చూస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ మహిళా యజమాని ప్రవర్తన పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని ఓ హౌజింగ్‌ సొసైటీలో నివసిస్తున్న బాలుడు సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్నాడు. పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లోకి ఎక్కగా.. ఆ తర్వాత ఓ మహిళ తన పెంపుడు శునకంతో ఆ లిఫ్ట్‌లో ఎక్కింది. అయితే, లిఫ్ట్‌ ఎక్కిన కొద్దిసేపటికే ఆ బాలుడి కుక్క కరిచేసింది. ఫలితంగా అతడు కాలును పట్టుకొని బాధతో విలవిల్లాడుతూన్నా.. ఆ మహిళ మాత్రం తనకేమీ పట్టనట్లు నిర్దయగా వ్యవహరించింది. బాలుడిని అలాగే చూస్తూ ఉందే తప్ప ఏమాత్రం స్పందించలేదు. బయటకు వెళ్లే సమయంలోనూ ఆ శునకం మరోసారి దాడికి యత్నించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

Dog Bites Kid In Lift
యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఈ వీడియోను అకాశ్‌ ఆశోక్‌ గుప్తా అనే ట్విటర్‌ యూజర్‌ ట్వీట్‌ చేస్తూ.. ఎవరూ చూడకపోతే నైతికంగా ఉండాల్సిన బాధ్యతలేదా? అంటూ ప్రశ్నించారు. కాగా ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారడం వల్ల నెటిజన్లు ఆ మహిళపై మండిపడుతున్నారు. 'అనైతికం, సిగ్గుచేటు.. మానవత్వాన్ని మరిచిపోతున్నారు. బాలుడి బాధను పట్టించుకోని ఆమెను ఏమనాలి?' అంటూ ఓ నెటిజన్‌ ఘాటుగా స్పందించాడు. 'అలా వ్యవహరించిన ఆ జాలిలేని మహిళను శిక్షించాలి' అంటూ మరికొందరు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఘజియాబాద్‌ పోలీసులు స్పందించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ శునకం యజమానిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:భారత్​ బయోటెక్​ నాసల్​ వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్​సిగ్నల్​

భారత్​- బంగ్లా మధ్య కీలక ఒప్పందం.. కుషియారా నదీజలాల విషయంలో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.