ETV Bharat / bharat

'వ్యాక్సిన్ లేదని ఉరి వేసుకోవాలా?' - వ్యాక్సిన్ ఉత్పత్తి చాలినంత లేకపోతే ఉరివేసుకుంటామా అన్న సదానంద గౌడ

వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి సదానంద గౌడ వివాదాస్పదంగా మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోతే అధికారులు ఉరివేసుకోలేరు కదా! అని అన్నారు. అందరికీ సకాలంలో వ్యాక్సిన్ అందేలా చూడాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఈమేరకు స్పందించారు.

Sadananda Gowda
సదానంద గౌడ
author img

By

Published : May 13, 2021, 5:40 PM IST

అందరికీ సకాలంలో వ్యాక్సిన్ అందేలా చూడాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పందిస్తూ.. కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి సదానంద గౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తయారీ సంస్థలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోతే అధికారులు ఉరివేసుకోలేరు కదా! అని అన్నారు.

"రాజకీయ లబ్ధి కోసం కాకుండా నిజాయితీగా ప్రయత్నిస్తున్నాము. కానీ కావాల్సినంత వ్యాక్సిన్ ఉత్పత్తి జరగట్లేదు. అది మన పరిధిని దాటి ఉంది. అందిరికీ వ్యాక్సిన్ అందించాలని కోర్టులు చెబుతాయి. కానీ వ్యాక్సిన్ ఉత్పత్తి చాలినంత లేకపోతే ఏం చేస్తారు? అధికారులు ఉరి వేసుకోలేరు కదా! ప్రధాని మోదీనే వ్యాక్సిన్ ప్రచారకునిగా ఉన్నారు. మరో వారంలో సందేహాలు తీరిపోతాయి."

-సదానంద గౌడ, కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ

కర్ణాటకలో ప్రతిరోజు 40,000 నుంచి 50,000 కొత్త కేసులు నమోదవుతుండగా... టీకాకు డిమాండ్ బాగా పెరిగింది. 3 కోట్ల టీకా డోసులు కావాలని వ్యాక్సిన్ తయారీదారులను ప్రభుత్వం కోరింది. ఇప్పటికే అందుకు కావాలసిన నగదును సైతం చెల్లించింది.

ఇదీ చదవండి: 'కరోనాకు జీవించే స్వేచ్ఛ ఉంది కదా?'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.