ETV Bharat / bharat

'ట్రాఫిక్ సమస్యే​ చాలా మంది విడాకులకు కారణం' - BMc Elections

Divorce Due to Traffic: ట్రాఫిక్ సమస్య వల్లే ముంబయిలో విడాకులు పెరిగిపోతున్నాయని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత ఫడణవీస్‌. మహా వికాస్ అఘాడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Amruta Fadnavis
అమృత ఫడణవీస్‌
author img

By

Published : Feb 5, 2022, 3:20 PM IST

Divorce Due to Traffic: ముంబయిలో భార్యాభర్తల విడాకులకు సరికొత్త కారణం చెప్పారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత ఫడణవీస్‌. ట్రాఫిక్‌ సమస్య వల్ల ప్రజలు తమ కుటుంబ సభ్యులకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారని అన్నారు. ఆ పరిస్థితులు విడాకులకు దారితీస్తున్నట్లు ఆమె చెప్పారు. ముంబయిలో విడాకులు తీసుకుంటున్నవారిలో 3శాతం మంది ట్రాఫిక్‌ సమస్య బాధితులేనని అమృత ఫడణవీస్‌ తెలిపారు. మహా వికాస్ అఘాడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి వారి సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తుందని విమర్శించారు.

ఈ రకమైన వాదనను వినడం ఇదే తొలిసారని ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ విమర్శించారు. ట్రాఫిక్ సమస్యల కారణంగానే విడాకులు తీసుకుంటున్నారనే వాదన విస్మయం కలిగిస్తోందని అన్నారు. విడాకులకు చాలా కారణాలుండవచ్చని చెప్పారు. అయితే.. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అమృత ఫడణవీస్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: Rahul Gandhi on Hijab: 'దేశంలో ఆడపిల్లల భవిష్యత్తును దోచుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.