ETV Bharat / bharat

జోధ్​పుర్​లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. భారీగా పోలీసుల మోహరింపు - Rajasthan hindi news

Jodhpur fight: రాజస్థాన్​ జోధ్​పుర్​లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పక్షాలు నడిరోడ్డుపైనే పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను చెదరగొట్టారు. ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు.

Jodhpur fight
జోధ్​పుర్​లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.
author img

By

Published : Jun 8, 2022, 12:09 AM IST

జోధ్​పుర్​లో రెండు వర్గాల మధ్య ఘర్షణ

Jodhpur Dispute: రాజస్థాన్ జోధ్​పుర్​లో మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య భీకర ఘర్షణ చెలరేగింది. ఇద్దరు యువకుల మధ్య మొదలైన గొడవ.. పెద్దగా మారి రెండు వర్గాలు నడిరోడ్డుపైనే బాహాబాహీకి దిగాయి. ఇరు వర్గాలకు చెందిన యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. పిడుగిద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఓ యువకుడ్ని ఆస్పత్రికి కూడా తరలించినట్లు సమాచారం. సూర్​సగర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. రెండు వర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ఓ స్థానిక యువకుడు ట్యాక్సీ డ్రైవర్​తో గొడవపడ్డాడని, అది కాస్త పెద్దగా మారి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఘటన గురించి తెలిశాక భాజపా, కాంగ్రెస్​ శ్రేణులు కూడా అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.