ETV Bharat / bharat

అసైన్డ్​ భూముల విక్రయ హక్కుపై భిన్న వాదనలు - అసైన్డ్‌ భూములను అమ్ముకోవచ్చని చట్టంలో మార్పులు

పేదలకు పంచిన (అసైన్డ్‌) భూములను ఎవరూ ప్రలోభాలకు గురిచేసి తీసుకోకుండా, దౌర్జన్యంగా లాక్కోకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. అసైన్డ్‌ భూములను తరతరాలుగా అనుభవించాల్సిందే కానీ ఇతరులకు బదలాయించకూడదనేది చట్ట నియమం. పకడ్బందీ చట్టం ఉన్నా- మరోవైపు వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి. అవసరానికి అసైన్డ్‌ భూములను అమ్ముకునే వెసులుబాటు లేకపోవడంవల్ల అవస్థలు పడుతున్నామని కొందరు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని రకాల అసైన్డ్‌ భూములను అమ్ముకోవచ్చని చట్టంలో మార్పులు చేశారు.

assigned lands
అసైన్డ్​ భూముల విక్రయ హక్కుపై భిన్న వాదనలు
author img

By

Published : May 12, 2021, 9:19 AM IST

కలితో ఉన్నవారికి భోజనం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది. అదే కొంచెం భూమి ఇస్తే జీవితం నిలబడుతుంది. ఆ వ్యక్తి కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. కొన్ని తరాలకు మేలు జరుగుతుంది. రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరుతాయి. అందుకే దశాబ్దాలుగా పేదలకు భూములపై హక్కులను కల్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే భూకమతాలపై పరిమితి విధించి- మిగులు భూములను పేదలకు పంచారు. భూదాన్‌ భూములు, ప్రభుత్వ భూములను పంపిణీ చేశారు. ప్రభుత్వ భూములను పేదలకు పంచడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పేదలకు పంచిన (అసైన్డ్‌) భూములను ఎవరూ ప్రలోభాలకు గురిచేసి తీసుకోకుండా, దౌర్జన్యంగా లాక్కోకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. అసైన్డ్‌ భూములను తరతరాలుగా అనుభవించాల్సిందే కానీ ఇతరులకు బదలాయించకూడదనేది చట్ట నియమం. పకడ్బందీ చట్టం ఉన్నా- మరోవైపు వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి. అవసరానికి అసైన్డ్‌ భూములను అమ్ముకునే వెసులుబాటు లేకపోవడంవల్ల అవస్థలు పడుతున్నామని కొందరు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని రకాల అసైన్డ్‌ భూములను అమ్ముకోవచ్చని చట్టంలో మార్పులు చేశారు. అసైన్డ్‌ భూములకు పూర్తి పట్టా హక్కులు కల్పించడమా లేదా చట్టాన్ని మరింత సడలించడమా అనే చర్చ జరుగుతోంది.

అనుభవ హక్కులు మాత్రమే..

స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే అందరికీ భూమి హక్కులు ఉండాలనే లక్ష్యంగా భూసంస్కరణలు ప్రారంభమైనాయి. కౌలుదారులకు రక్షణలు, ఇనాం, జాగీర్లు, సంస్థానాలులాంటి వ్యవస్థలను రద్దుచేసి- దున్నేవారికే భూమిపై హక్కులు కల్పించడం మొదటి తరం భూసంస్కరణలు. రెండోదశలో ప్రభుత్వ, భూదాన భూముల పంపిణీ చేపట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే దాదాపు అరకోటి ఎకరాల ప్రభుత్వ భూమి, లక్ష ఎకరాల పైచిలుకు భూదాన భూమిని పేదలకు పంచారు. ప్రభుత్వ భూములపై పేదలకు ఇచ్చిన పట్టాలనే అసైన్డ్‌, డిఫార్మ్‌, లావోని, డికెటీ పట్టాలని అంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఆరు లక్షల ఎకరాల సీలింగ్‌ మిగులు భూములను పంచారు. పేదలకు పంచిన భూములను వారసత్వంగా అనుభవించాలే కానీ అమ్ముకోవడం, దానం చేయడం, కౌలుకు ఇవ్వడం కుదరదని; వీలునామా, తనఖా లేదా మరేవిధంగానైనా బదలాయించడానికి వీలులేదనేది ప్రభుత్వం ఇచ్చిన పట్టాలో ఒక ముఖ్యమైన షరతు. కానీ, పేదలకు ఇచ్చిన భూములు వారి స్వాధీనంలో ఎక్కువకాలం ఉండటంలేదు. అందుకే, పేదలకు ఇచ్చిన భూముల రక్షణ కోసం 70వ దశకంలో కేంద్రం ఒక ముసాయిదా చట్టం రూపొందించి రాష్ట్రాలకు పంపింది. దాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు చట్టాలు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సైతం 1977లో అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టాన్ని పీఓటీ లేదా 9/77 చట్టం అని అంటారు. ఈ చట్టం మేరకు అసైన్డ్‌ భూముల బదలాయింపు చెల్లదు. పేదలకిచ్చిన భూదాన్‌ భూములను అమ్మకూడదని భూదాన, గ్రామదాన చట్టం-1965లో సీలింగ్‌ పట్టాలిచ్చిన వాటిని అమ్మకూడదని వ్యవసాయ భూపరిమితి చట్టం-1961లో నిబంధనలు ఉన్నాయి. చట్టం చేసినప్పుడే ఈ నిబంధనలకు కొన్ని మినహాయింపులూ ఇచ్చారు. మరికొన్నింటిని ఆ తరవాత చట్టంలో చేర్చారు. 1958 కంటే ముందు తెలంగాణలో, 1954 కంటే ముందు ఆంధ్రప్రదేశ్‌లో అసైన్‌ చేసిన, 1977కి ముందు భూమిలేని పేదలు కొనుగోలు చేసిన, వేలంలో కొన్న, రాజకీయ బాధితులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, మాజీ సైనికులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను అమ్ముకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలాలను 20 సంవత్సరాల తరువాత అమ్ముకోవచ్చు.

అసైన్డ్‌ భూముల అమ్మకాలపై నిషేధం లేకపోతే పేదల చేతుల్లో సెంటుభూమి సైతం మిగలదనే వాదనా అంతే బలంగా ఉంది. అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ భూమిని తిరిగి మొదటి అసైనీకి అప్పగించడమో లేదా మరో పేద కుటుంబానికి ఇవ్వడమో చెయ్యాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన కోనేరు రంగారావు భూకమిటీ సూచించింది. అసైన్డ్‌ భూములను బ్యాంకులు వేలం వేస్తే అవి ఇతరుల చేతికి వెళ్లకుండా ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'వ్యవసాయ సంబంధాలు, అసంపూర్ణ భూసంస్కరణల కమిటీ' కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది.

ప్రభుత్వమే కొనుగోలు..

భూమి కేవలం ఆర్థిక వనరు మాత్రమే కాదు... ఒక గుర్తింపు, సామాజిక గౌరవం, అధికార చిహ్నం. భూమి ఉంటేనే రైతుగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందగలిగేది. ఒక్క మాటలో చెప్పాలంటే భూమే జీవితం. భూమే సర్వస్వం. కాబట్టి భూమి ఉండటం, ఆ భూమిపై సర్వహక్కులు కలిగి ఉండటం అందరికీ కీలకమే. అది పట్టాభూమైనా, అసైన్డ్‌ పట్టా అయినా. అసైన్డ్‌ భూములను అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తూనే- అది పేదలను పూర్తిగా భూములకు దూరం చెయ్యడానికి కారణం కాకుండా చూడాలి. ఇప్పటికే దళితులు, గిరిజనుల చేతిలో ఉన్న భూములు ఏటా తగ్గుతున్నాయని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్దేశిత గడువు తరవాత ప్రభుత్వ అనుమతితో అసైన్డ్‌ భూములను అమ్ముకునే వీలు కల్పించే అంశాన్ని పరిశీలించాలి. పేదలు తమ అవసరాలకోసం నిర్దేశిత గడువు ముందైనా, తరవాతైనా భూములు అమ్ముకోవాల్సివస్తే ప్రభుత్వమే కొనుగోలు చేసే ఏర్పాటు చెయ్యాలి. అందుకోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చెయ్యాలి. భూసేకరణ చట్టంలో నిర్దేశించిన ధర ప్రకారం ప్రభుత్వమే భూమి తీసుకోవచ్చు. ఒకసారి భూమి అమ్మితే మళ్లీ ఆ కుటుంబానికి భూమి ఇవ్వొద్దనే నియమం పెట్టొచ్చు. పేదరికం నుంచి బయటపడటానికి ఇచ్చిన భూమిని అమ్ముకునే స్వేచ్ఛ మళ్ళీ ఆ కుటుంబాన్ని మరింత పేదరికంలోకి నెట్టకుండా జాగ్రత్త పడాలి.

అనుమతులతో అవకాశం..

భూమిని సాగు చేసుకోవడంతోపాటు అవసరానికి అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలనే వాదన ఎంతో కాలంగా ఉంది. భూమిపై హక్కు అంటే అనుభవించడం మాత్రమే కాదు- తనఖా పెట్టడం, వీలునామా రాయడం, దానం చేయడంవంటి సర్వహక్కులూ కలిగి ఉండటం. పట్టా భూములపై ఉండే ఇలాంటి హక్కులన్నీ ప్రభుత్వం ఇచ్చిన భూములమీదా ఉండాలనే వాదన బలంగా వినిపిస్తోంది. అసైన్డ్‌ భూములపై నిషేధం ఉన్నా- అమ్మకాలు ఆగడంలేదు. అవసరానికి తనఖా పెట్టడానికో, అమ్ముకోవడానికో అవకాశం ఉంటే పేదలకు మరింత భరోసా ఉంటుందనేది పలువురి అభిప్రాయం. కర్ణాటక రాష్ట్రంలో 15ఏళ్ల తరవాత; ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పదేళ్ల తరవాత ప్రభుత్వం ఇచ్చిన భూములను తగిన అనుమతులతో అమ్ముకోవచ్చు. ఇలా పట్టా ఇచ్చిన కొన్నేళ్లకైనా అమ్ముకునే అవకాశాన్ని ఇచ్చే అంశం పరిశీలించాలి.

-ఎం. సునీల్​ కుమార్​, భూచట్టాల నిపుణులు, నల్సార్​ విశ్వవిద్యాలయం అనుబంధ ఆచార్యులు

ఇదీ చూడండి: దిల్లీ సరిహద్దులకు రైతులు.. ఆందోళనలు ఉద్ధృతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.