ETV Bharat / bharat

హనుమంతుడికి రైల్వేశాఖ నోటీసులు.. స్థలం ఖాళీ చేయాలని ఆదేశం.. అసలేమైంది?

రైల్వే భూమిని ఆక్రమించి హనుమాన్ మందిరం నిర్మించారని.. ఆ ఆలయానికి రైల్వేశాఖ నోటీసు పంపింది. రైల్వేశాఖ పంపిన ఈ నోటీసుపై గ్రామస్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

notice to hanumanji
హనుమాన్​ మందిరానికి నోటీసులు
author img

By

Published : Oct 11, 2022, 3:41 PM IST

Updated : Oct 11, 2022, 6:41 PM IST

గోపాల గోపాల సినిమాలో దేవుడికి నోటీసులు పంపినట్లు.. హనుమాన్ మందిరానికి రైల్వే శాఖ నోటీసులు పంపింది. ఈ చర్యతో చుట్టు పక్కల ప్రజల నుంచి రైల్వేపై వ్యతిరేకత ఎదురవుతుంది. ఝార్ఖండ్​లో ధన్​బాద్ జిల్లాలో భారతీయ తూర్పు మధ్య రైల్వేలో ఈ వింత అనుభవం ఎదురైంది.

హనుమాన్ మందిరం
హనుమాన్​ మందిరం

అసలు ఆ నోటీసులో ఏం ఉందంటే..
ధన్​బాద్​ జిల్లా బేకర్‌బంద్ కాలనీలోని రైల్వే భూమి అనధికారికంగా ఆక్రమణకు గురైందని.. తూర్పు మధ్య రైల్వే అసిస్టెంట్ ఇంజనీర్ పేరుతో ఆలయంలో నోటీసు అంటించారు. రైల్వే భూమిలో ఆలయాన్ని అక్రమంగా నిర్మించడం చట్టరీత్యా నేరమని.. నోటీసు అందిన పది రోజుల్లోగా ఈ భూమిని ఖాళీ చేయాలని అందులో రాసి ఉంది. భూమిని ఖాళీ చేసి సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌కు అప్పగించాలని.. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

ఈ నోటీసు అందిన తరవాత.. సమీపంలో నివసిస్తున్న ప్రజల్లో రైల్వే శాఖ పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానిక ప్రజలు నిరసనకు దిగారు. తాము తరతరాలుగా ఈ హనుమాన్‌ ఆలయంలో పూజలు చేస్తున్నామని ప్రజలు చెబుతున్నారు. 1931 నుంచే ఇక్కడ చాలా మంది నివాసం ఉంటున్నారని.. ఇప్పుడు ఆలయాన్ని తొలగించాలని రైల్వే శాఖ ఒత్తిడి తేవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Oct 11, 2022, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.