మిజోరాంలోని సెర్చిప్ జిల్లాలో భారీగా డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ముందస్తు సమాచారం ప్రకారం తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఫర్కావన్ జంక్షన్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న 3వేల డిటోనేటర్లు, 925 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 2వేల మీటర్ల ఫ్యూజ్ వైర్, 1.304 టన్నుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
జప్తు చేసిన సామాగ్రిని దంగ్తలాంగ్ పోలీస్ స్టేషన్కు తరలించామని అసోం రైఫిల్స్(ఏఆర్) అధికారి తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు.
ఇదీ చదవండి : కులాంతర వివాహం చేసుకుందని గుండు కొట్టారు!