ETV Bharat / bharat

వైద్యుడి చాకచక్యం- 270మంది రోగులకు పునరుజ్జీవం! - Jalgaon Corona updates

దేశంలో రెండో దఫా కొవిడ్​ విజృంభణతో మెడికల్​ ఆక్సిజన్​కు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. అనేక చోట్ల ఆక్సిజన్​ కొరతతో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలెన్నో వెలుగుచూశాయి. మహారాష్ట్రలోనూ ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్​​ నిండుకునేందుకు సమయం సమీపించగా.. అక్కడున్న వైద్య సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి.. సుమారు 270 మంది కొవిడ్​ రోగులకు ప్రాణం పోశారు.! అదెలాగంటే...

Oxygen Tanker
ఆక్సిజన్ ట్యాంకర్​
author img

By

Published : May 15, 2021, 1:01 PM IST

Updated : May 15, 2021, 1:27 PM IST

రెండో విడత కరోనా విజృంభణతో దేశంలో ప్రాణవాయువుకు తీవ్ర కొరత ఏర్పడింది. మహారాష్ట్ర జలగావ్​లోని ఓ ఆస్పత్రిలో గురువారం(ఈ నెల 13న) రాత్రి ఆక్సిజన్ ట్యాంకు నిండుకునేందుకు సమయం దగ్గరపడింది. సకాలంలో ట్యాంకర్లు ఆస్పత్రికి చేరుకోలేకపోయాయి. ఈ తరుణంలో చాకచక్యంగా వ్యవహరించారు అక్కడి ఆక్సిజన్​ నిర్వహణ వైద్యులు. కొద్దిపాటి ఆక్సిజన్​​ను అందరికీ సరఫరా చేసి.. సుమారు 270 మంది కొవిడ్​ రోగులను కాపాడింది డాక్టర్​ సందీప్ పటేల్ నేతృత్వంలోని​​ బృందం.

ఇదీ చదవండి:కొవాగ్జిన్​, కొవిషీల్డ్, స్పుత్నిక్​-వి మధ్య తేడా ఏంటి?

'ఆపరేషన్ ఆక్సిజన్' సక్సెస్​ అయిందిలా..

ఈ నెల 13న సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ప్రభుత్వ వైద్య కశాశాలలో ఉన్న 20 కిలోలీటర్ల ఆక్సిజన్​ అయిపోయేందుకు సమయం దగ్గర పడింది. ఈ సందర్భంలో ఎలాంటి ఆందోళనకు గురికాకుండా.. ట్యాంకర్​ అయిపోవడానికి 10 నిముషాల ముందే 100 ఆక్సిజన్​ సిలిండర్లను అమర్చింది సందీప్​ బృందం. ఇందుకోసం సుమారు 8 గంటలు నిరంతరంగా శ్రమించారు సందీప్​, ఆయన బృంద సభ్యులు. ఆ సమయంలో ఆస్పత్రి డీన్​ రామానంద్​ అక్కడే ఉండి వారి పనితీరును పర్యవేక్షించారు.

ఓ వైపు.. జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు.. ఇంటి నుంచి ఫోన్​కాల్స్​ వచ్చినా.. వారికి సర్దిచెబుతూ విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చారు సందీప్. సుదీర్ఘ ప్రయత్నం అనంతరం.. ఆపరేషన్ విజయవంతం కావడం వల్ల అతడిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తన పుట్టిన రోజు(మే 14) నాడు సైతం కుటుంబానికి దూరంగా ఉండి.. విధి నిర్వహణలో కీలకపాత్ర పోషించిన​ సందీప్​​ను డీన్ రామానంద్​​ ఘనంగా సత్కరించారు.

Dr Sandepp Patel, Dr Ramanand
డాక్టర్​ సందీప్​ పటేల్​ను సత్కరిస్తున్న డాక్టర్​ రామానంద్​ తదితరులు

ఆఫీస్​ టైమ్​ అయిపోయినా..

ఈ సందర్భంలో.. విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న సిబ్బందిని ఆపి.. వారి సేవలనూ ఉపయోగించుకున్నారు డాక్టర్​ సందీప్​. వారితో అన్ని వార్డుల ఆక్సిజన్​ నిల్వ సమాచారాన్ని సేకరించి.. ట్యాంకర్​లో ఉన్న నిల్వ ఆక్సిజన్​ను అందరికీ అందేలా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్​ వ్యాపారిని పిలిపించి.. మరో 100 సిలిండర్లు ఆర్డర్​ చేశారు. అనంతరం.. ఆ ఆస్పత్రికి రావాల్సిన ట్యాంకర్​ అర్ధరాత్రి 12:42 గంటలకు అక్కడికి చేరుకుంది. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: 3వారాల్లో కరోనాను జయించిన 2నెలల పసికందు

Last Updated : May 15, 2021, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.