ETV Bharat / bharat

రాందేవ్ బాబాకు దిల్లీ హైకోర్టు సమన్లు - రాందేవ్ బాబాకు దిల్లీ హైకోర్టు సమన్లు

యోగా గురువు రాందేవ్ బాబాకు అలోపతి వైద్యం వివాదం ఉచ్చు బిగుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.

ramdev baba issue
రాందేవ్ బాబాకు దిల్లీ హైకోర్టు సమన్లు
author img

By

Published : Oct 28, 2021, 4:51 AM IST

అలోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాకు దిల్లీ హైకోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని అందులో ఆదేశించింది. " రాందేవ్ వీడియో క్లిప్పులు చూశాను. అలోపతి చికిత్స ప్రొటోకాల్​ను ఆయన అపహాస్యం చేశారు" అని న్యాయమూర్తి జస్టిస్​ సి. హరిశంకర్ తెలిపారు.

రాందేవ్ వ్యాఖ్యలు..

కొవిడ్​-19(Covid-19) చికిత్సలో ఉపయోగిస్తున్న అలోపతి ఔషధాల(Allopathic medicine) సామర్థ్యంపై రాందేవ్(Ramdev) గతంలో అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ మందుల కారణంగా లక్షలాది మంది చనిపోయారని వ్యాఖ్యానించారు. చివరకు ఆ వ్యాఖ్యలను ఆయన​ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అయితే.. ఆ క్రమంలోనే అలోపతి ఔషధాలపై సందేహాలను లేవనెత్తుతూ ఇండియన్ మెడికల్​ అసోసియేషన్​కు 25 ప్రశ్నలు సంధించారు.

ఇదీ చదవండి:సమయం దాటినా రెండో డోసు తీసుకోని వారు 11 కోట్ల పైనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.