ETV Bharat / bharat

స్పుత్నిక్-వీ టీకాల కోసం డాక్టర్ రెడ్డీస్​కు కేజ్రీ లేఖ

స్పుత్నిక్‌-వీ టీకా డోసులను సరఫరా చేయాలని కోరుతూ.. డాక్టర్‌ రెడ్డీస్‌కు లేఖ రాసింది దిల్లీ సర్కార్. 67 లక్షల డోసులు అందించాలని కోరింది. అయితే ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదని సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ వెల్లడించారు.

Kejriwal
కేజ్రీవాల్​
author img

By

Published : May 16, 2021, 6:28 AM IST

దేశ రాజధాని దిల్లీలో ఏర్పడిన కరోనా టీకాల కొరత తీర్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు సీఎం అరవింద్​ కేజ్రీవాల్​. ఈ క్రమంలో 67 లక్షల స్పుత్నిక్‌-వీ టీకాలు సరఫరా చేయాలని కోరుతూ.. డాక్టర్​ రెడ్డీస్​కు లేఖ రాశారు. దిల్లీకి అదనపు కొవాగ్జిన్​ టీకాలు ఇచ్చేందుకు భారత్​ బయోటెక్​ నిరాకరించినట్లు డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా తెలిపిన కొన్ని రోజులకే కేజ్రీవాల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

"67 లక్షల డోసులు కావాలని కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ ఉత్పత్తి సంస్థలను కోరాం. అలాగే స్పుత్నిక్​ డీలర్లుగా ఉన్న డాక్టర్​ రెడ్డీలకు అదే పరిమాణంలో టీకాలు కావాలని లేఖ రాశాం. వారిని(డాక్టర్​ రెడ్డీస్​ను) ఎన్ని డోసులు.. ఏ సమయానికి అందిస్తారని అడిగాం. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు"

-అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ సీఎం

విస్తృత స్థాయిలో టీకా పంపిణీ ద్వారానే కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు. పలు దేశాల అనుభవం ఈ విషయాన్ని రుజవు చేస్తుందన్నారు.

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్​ టీకాను దేశంలో తొలిసారిగా డాక్టర్ రెడ్డీస్​ వినియోగంలోకి తీసుకొచ్చింది.

ఇదీ చూడండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం- 10 కిలోల ఐఈడీ స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.