ETV Bharat / bharat

రూ.76వేల కోట్లతో ఆయుధాలు కొనుగోలు.. భారత్​ ఇక సూపర్​ స్ట్రాంగ్! - రక్షణ శాఖ

స్వదేశీ ఉత్పత్తుల తయారీ, కొనుగోలులో భాగంగా సాయుధ దళాలకు అవసరమైన ఆయుధాలు, సామగ్రి కొనుగోలు చేసేందుకు రాజ్​నాథ్​ సింగ్​ నేతృత్వంలోని రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి-డీఏసీ ఆమోదం తెలిపింది. సైన్యం, నౌకాదళం, వాయుసేనకు అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు ప్రతిపాదనలు ఇందులో ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

Rajnath singh
రాజ్​నాథ్​ సింగ్​
author img

By

Published : Jun 6, 2022, 5:13 PM IST

Updated : Jun 6, 2022, 5:26 PM IST

రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నేతృత్వంలో 'రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఏసీ)' సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాలకు రూ.76,390 కోట్లు విలువైన ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలు, తయారీలో భాగంగా ఈ మేరకు ఆమోదం తెలిపినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

"భారత సైన్యం కోసం.. స్వదేశీ సంస్థల నుంచి ఫోర్క్​ లిఫ్ట్​ ట్రక్కులు, బ్రిడ్జ్​ లేయింగ్​ ట్యాంకులు, యాంటీ ట్యాంక్​ గైడెన్​ మిసైల్స్​ కలిగిన యుద్ధ వాహనాలు, రాడార్లను గుర్తించే ఆయుధాలు కొనుగోలు చేసేందుకు డీఏసీ ఆమోదం తెలిపింది. నౌకాదళం కోసం.. రు.36వేల కోట్లతో నెక్స్ట్​ జనరేషన్ కొర్వెట్​(ఎన్​జీసీ)లను కొనుగోలు చేసేందుకు ఆమోదం లభించింది. అత్యాధునిక సాంకేతికతతో సరికొత్త అంతర్గత డిజైన్​​ ఆధారంగా ఈ ఎన్​జీసీలను నిర్మించనుంది నౌకాదళం. మరోవైపు.. స్వదేశీ ఎయిరో ఇంజిన్​ సామగ్రి వినియోగాన్ని పెంచే లక్ష్యంతో హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్​ లిమిటెడ్​ ద్వారా డోర్నియర్​ ఎయిర్​క్రాఫ్ట్​లు, సుఖోయ్​-30 ఎంకేఐ ఎయిరో ఇంజిన్లను తయారు చేసేందుకు డీఏసీ ఆమోదం తెలపింది. "

- రక్షణ శాఖ

ఎన్​జీసీలు వర్సటైల్​ ప్లాట్​ఫామ్​లుగా రక్షణ శాఖ పేర్కొంది. అవి నిఘా మిషన్స్​, ఎస్కార్ట్​ ఆపరేషన్లు, ఉపరితల యాక్షన్​ గ్రూప్​ ఆపరేషన్లు, తీర ప్రాంత రక్షణ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తాయని తెలిపింది. మరోవైపు.. రక్షణ శాఖలో డిజిటలీకరణను ప్రవేశపెట్టేందుకు స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలు కింద.. 'డిజిటల్​ కోస్ట్​ గార్డ్​' ప్రాజెక్టుకు రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్​ కింద.. వివిధ రకాల ఉపరితల, వాయుమార్గాల కార్యకలాపాలు, తీర ప్రాంత రక్షణ దళంలో లాజిస్టిక్స్​, ఆర్థిక, హెచ్​ఆర్​ వంటి ప్రక్రియలను డిజిటలైజ్​ చేయడానికి సురక్షితమైన నెట్​వర్క్​ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: కేరళలో మరో వైరస్​.. రెండు పాజిటివ్ కేసులు.. కేంద్రం హైఅలర్ట్

ఆ ఇద్దరికీ తెలియకుండా ఆమెకు మూడో పెళ్లి.. న్యాయం కోసం భర్తల పోరాటం!

Last Updated : Jun 6, 2022, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.