చనిపోయిన వృద్ధురాలు తిరిగి బతుకుతుందని ఆమె శవం దగ్గర కూర్చుని ఇద్దరు కుమార్తెలు ప్రార్థనలు చేసిన ఘటన తమిళనాడు తిరుచ్చి జిల్లాలో శనివారం వెలుగుచూసింది. (Tamilnadu news)
పోలీసుల కథనం ప్రకారం.. మణపారై సమీపాన చొక్కంపట్టి వీజీపీ ఫ్లాట్‌కు చెందిన వృద్ధురాలు మేరి (75). ఆమె భర్త 20ఏళ్ల కిందట మరణించాడు. అవివాహితులైన ఇద్దరు కుమార్తెలు జయంతి (43), జెసిందా (40) ఆమెతో ఉన్నారు. ఆ ఇంటి నుంచి 2 రోజులుగా ప్రార్థనలు చేసినట్లు బిగ్గరగా శబ్దాలు వినిపించాయి. (Tamilnadu news)
పోలీసులు వచ్చి..
స్థానికులు మణపారై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ కరుణాకరన్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. రెండ్రోజుల కిందట మేరి చనిపోయిందని, ఆమె మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకుని కుమార్తెలు ప్రార్థనలు చేస్తున్నారని తెలిసింది. పోలీసులను లోనికి రాకుండా ఇద్దరు కుమార్తెలు అడ్డుకున్నారు. తల్లి మరణించలేదని, ఆమెను చంపడానికి చూస్తున్నారా? అంటూ విరుచుకుపడ్డారు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి 108 సిబ్బంది ప్రయత్నించగా గొడవకు దిగారు. ప్రార్థనలు చేస్తే తల్లి తిరిగి బతుకుతుందని వాదించారు.
4 గంటల తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మనపారై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడకు కూడా వెళ్లిన కుమార్తెలు వైద్యులతోనూ వాగ్వాదానికి దిగారు.
ఇదీ చదవండి: