ETV Bharat / bharat

కూతురు ప్రేమ వివాహం-  మేకకు సీమంతం! - చిత్రదుర్గ వార్తలు

కూతురు ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో.. పెంచుకుంటున్న మేకకు సీమంతం చేశారు ఆ కుటుంబ సభ్యులు. ఈ ఘటన కర్ణాటక చిత్రదుర్గలో జరిగింది.

Daughter ran away with lover, parents did Seemantha for goat !
కూతురు ప్రేమ వివాహం.. మేకకు సీమంతం!
author img

By

Published : Mar 10, 2021, 3:12 PM IST

కూతురు సమానంగా పెంచుకుంటున్న మేకకు సీమంతం చేశారు కర్ణాటక చిత్రదుర్గ జిల్లా నన్నివాలా గ్రామానికి చెందిన రాజు-గీతా దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కుమార్తె రంజిత పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఓ మేకను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ కుటుంబ సభ్యులు.

ఈ మేక అంటే చాలా ఇష్టం. నా కుమార్తెతో సమానంగా చూసుకుంటా. నా పెద్ద కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించిన యుకుడిని వివాహం చేసుకుంది. ఈ ఘటన తరువాత ఒక మేకను తెచ్చుకుని.. కుమార్తెలాగా ప్రేమగా చూసుకుంటున్నా.

-గీత

కూతురు ప్రేమ వివాహం.. మేకకు సీమంతం!

ఈ మేకకు ముందు వారు ఒక జింకను పెంచుకున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల వల్ల జింకను అడవిలో వదిలిపెట్టారు. దీంతో రాజు కుటుంబ సభ్యులంతా మానసికంగా కుంగిపోయారు.

జింకను అడవిలో వదిలి వచ్చిన తరువాత చిన్న మేకను తెచ్చుకుని దాన్ని కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటున్నట్లు రాజు చిన్న కుమార్తె రజనీ వివరించింది. ఈ క్రమంలో మేక గర్భం దాల్చిగా.. దానికి సీమంతం నిర్వహించాలనే ఆలోచన రాజు చిన్న కుమార్తే రజినికి వచ్చింది. తల్లిదండ్రులు సైతం రజిని కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని జరిపించారు.

మా పద్దూ(మేక) అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నా అక్క లాంటిది. నా కోరిక మేరకు గర్భిణీ స్త్రీల మాదిరే దానికి సీమతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.

-రజని, గీత చిన్న కుమార్తె.

ఇదీ చదవండి: అత్త చావుతో షాక్-కోడలి ఆత్మహత్య

ఇది పాలిచ్చే ఏటీఎం గురూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.