ప్రేమికుల రోజు సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు వివాహం జరిపించారు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ పోలీసులు. 15 మంది నక్సల్స్‌కు వివాహం చేయించినట్లు ఎస్పీ అభిషేక్ పల్లవ్ పేర్కొన్నారు.
'గత ఆరునెలల నుంచి కొందరు నక్సల్స్ తమ ఆయుధాలతో పోలీసులకు లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి రివార్డులు కూడా అందిస్తున్నాం. 15 మంది నక్సల్స్‌కు వారి కుటుంబ పెద్దల సమక్షంలో వివాహం జరిపించాం"అని ఎస్పీ అభిషేక్ తెలిపారు.
ఇదీ చదవండి:'ఆ దారుణాన్ని క్షమించం..మరచిపోం'