ETV Bharat / bharat

పెను తుపానుగా 'తౌక్టే'- కొద్ది గంటల్లో గుజరాత్​ తీరానికి.. - భారత వాతావరణ శాఖ

తీర ప్రాంత రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న 'తౌక్టే' తుపాను మరింత విజృంభించి పెను తుపానుగా మారింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరు గంటల మధ్య ఇది గుజరాత్​ను తాకనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్య గుజరాత్​ తీరాన్నిదాటుతుందని చెప్పింది.

Cyclone Tauktae
అతి భీకర తుపానుగా 'తౌక్టే'
author img

By

Published : May 17, 2021, 11:11 AM IST

Updated : May 17, 2021, 12:42 PM IST

'తౌక్టే' తుపాను పెను తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం తెల్లవారు జామున తుపానులో ఈ మార్పు జరిగిందని తెలిపింది. దీని వల్ల గాలి వేగం గంటకు 180-190 కి.మీటర్లకు పెరుగుతుందని చెప్పింది. గాలి దుమారం వేగం గంటకు 210 కి.మీటర్ల వరకు ఉంటుందని పేర్కొంది.

వాయువ్య దిశగా కదులుతున్న ఈ పెను తుపాను.. మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల మధ్య గుజరాత్​ తీరాన్ని తాకుతుందని ఐఎండీ చెప్పింది. రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్య పోర్​బంద్​-మహువా మధ్య తీరం దాటుతుందని చెప్పింది.

తుపాను నేపథ్యంలో సహాయ చర్యల కోసం భారత వైమానిక దళం చర్యలు చేపడుతోంది. 5xసి-130, 3xఎన్​-32 యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందిని తరలించేందుకు, విపత్తు సాయాన్ని అందించేందుకు వీటిని వినియోగిస్తోంది. పుణె, కోల్​కతా, విజయవాడ నుంచి వివిధ సామగ్రిని అహ్మదాబాద్​కు తరలిస్తోంది.

Cyclone Tauktae
సహాయక చర్యల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ బలగాలు
Cyclone Tauktae
ఎన్​డీఆర్​ఎఫ్​ బలగాలు
Cyclone Tauktae
సహాయక చర్యల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ బలగాలు

తుపాను ప్రభావంతో గుజరాత్​లో లోతట్టు ప్రాంతాల్లోని వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కోరారు.

Cyclone Tauktae
వర్షాల ప్రభావంతో గుజరాత్​ తీరంలో తేలియాడుతున్న చేపల పడవలు

తీర ప్రాంతాల్లోని ఆరు రాష్ట్రాల్లో 100 బృందాల ఎన్​డీఆర్ఎఫ్​ బలగాలు మోహరించాయని అధికారులు తెలిపారు. వాటిలో సగం బలగాలను తుపాను ప్రభావం అధికంగా ఉన్న గుజరాత్​లోనే మోహరించినట్లు చెప్పారు. తమిళనాడు, కర్ణాటకలో వర్షాల కారణంగా కొంత మంది మరణించారు.

తౌక్టా తుపాను ప్రభావంతో ముంబయి విమానాశ్రయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

Cyclone Tauktae
మహారాష్ట్రను ముంచెత్తుతున్న వర్షాలు
Cyclone Tauktae
ముంబయి రహదారులపై వర్షాలు

ఇదీ చూడండి: 'తౌక్టే' బీభత్సం- కర్ణాటకలో నలుగురు మృతి

Last Updated : May 17, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.