ETV Bharat / bharat

డీజీపీ ఫేస్​బుక్​ ఖాతాతో మోసగాళ్ల సైబర్​ వల

సైబర్​ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో అమాయకుల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇందుకు ప్రముఖల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి బోల్తా కొట్టిస్తున్నారు. ఝార్ఖండ్​ డీజీపీ నీరజ్​ సిన్హా పేరుతో నకిలీ ఖాతా సృష్టించి రిక్వెస్టులు పంపుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించామని ఆయనే వెల్లడించారు.

Neeraj sinha
ఝార్ఖండ్​ డీజీపీ నీరజ్​ సిన్హా
author img

By

Published : May 19, 2021, 3:29 PM IST

రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి సైబర్​ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. ఝార్ఖండ్​ డీజీపీ నీరజ్​ సిన్హా పేరిట సైబర్​ నేరగాళ్లు ఫేస్​బుక్​ నకిలీ ఖాతా తెరిచారు. పలువురికి ఫ్రెండ్​ రిక్వస్టులు సైతం పంపారు. ఝార్ఖండ్​ పోలీసు బాస్​ పేరిటే డబ్బులు వసూలు చేసేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న డీజీ.. తన పేరిట వస్తున్న రిక్వెస్టులు ఆమోదించకూడదని కోరారు.

పట్టుబడిన దాఖలాలు లేవు..!

సైబర్​ కేటుగాళ్లు ఇప్పటికే చాలా మంది ఐపీఎస్​లు, పోలీసు అధికారుల పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. అందులో కొల్హాన్​ డీఐజీ రాజీవ్​ రంజన్​ సింగ్​, రాంచీ డీసీ చిత్ర రంజన్​, బొకారో ఎస్పీ చందన్​ ఝా, సీఐడీ ఏడీజీ ఇంఛార్జ్​ అమరేంద్ర కుమార్​ వర్మ, విశ్రాంత​ డీజీపీ బిభూతి ప్రధాన్​, రిటైర్డ్​ డీఎస్​పీ అరవింద్​ కుమార్​ సిన్హా వంటి ప్రముఖులు ఉన్నారు. అయినప్పటికీ.. ఇంత వరకు ఒక్క కేసులోనూ నేరగాళ్లను పట్టుకున్న దాఖలాలు లేవు.

ఎలా చేస్తున్నారు?

అధికారుల నిజమైన ప్రొఫైల్స్​ నుంచి ఫొటోలు తీసుకొని వాటితో నకిలీ ఖాతాలు తెరుస్తున్నారు. అనంతరం స్నేహితల లిస్ట్​లో ఉన్నవారికి వారిలానే రిక్వెస్టులు పంపుతున్నారు. ఒకవేళ రిక్వెస్ట్​ను యాక్సెప్ట్​ చేస్తే ఆ తర్వాత తమ పని మొదలు పెడతారు. తాను అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉన్నానని, 10-20 వేల రూపాయలు తక్షణమే కావాలని కోరుతారు. మొబైల్​యాప్​ ద్వారా పంపాలని సూచిస్తారు. అది నమ్మిన చాలా మంది డబ్బులు పంపి మోసపోతున్నారు. ఇలాంటి ఘటనలు లాక్​డౌన్​ సమయంలో పెరిగిపోయాయి.

ఇదీ చూడండి: ఆయువు తీసిన ఆవు పేడ చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.