CSIR Recruitment 2023 : దిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) 444 సెక్షన్ ఆఫీసర్ (SO), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- సెక్షన్ ఆఫీసర్ - 76 పోస్టులు
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 368 పోస్టులు
- మొత్తం పోస్టులు - 444
విద్యార్హతలు
CSIR SO Qualifications : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
CSIR SO Age Limit : అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 33 ఏళ్లలోపు ఉండాలి. అయితే ఆయా కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు
CSIR SO Application Fee :
- యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.500 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మ్యాన్, CSIR డిపార్ట్మెంట్ అభ్యర్థులు, మహిళలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ
CSIR SO Selection Process : అభ్యర్థులకు స్టేజ్-1, స్టేజ్-2 రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, అర్హులైనవారిని ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
CSIR SO Salary :
- సెక్షన్ ఆఫీసర్ గ్రూప్-బి (గెజిటెడ్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.47,600 - రూ.1,51,100 చొప్పున జీతభత్యాలు ఇస్తారు.
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్-బి (నాన్-గెజిటెడ్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 - రూ.1,42,400 చొప్పున జీతభత్యాలు అందిస్తారు.
దరఖాస్తు విధానం
CSIR SO Application Process :
- అభ్యర్థులు ముందుగా CSIR అధికారిక వెబ్సైట్ https://www.csir.res.in/ ఓపెన్ చేయాలి.
- Recruitment ట్యాబ్‌పై క్లిక్ చేస్తే.. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- CSIR - COMBINED ADMINISTRATIVE SERVICES EXAMINATION – 2023 లింక్‌పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
CSIR SO Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 డిసెంబర్ 8
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జనవరి 14