బంగాల్లో కీలకంగా మారిన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో.. మహా కూటమి(వామపక్షం-కాంగ్రెస్-ఐఎస్ఫ్) తరఫున సీపీఐ(ఎం) నేత మీనాక్షి ముఖర్జీ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు వామపక్ష నేతృత్వంలోని కూటమి నిర్ణయించినట్టు ఛైర్మన్ బిమాన్ బోస్ తెలిపారు.
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నుంచి సీఎం మమతా బెనర్జీ, భాజపా అభ్యర్థి సువేందు అధికారి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నందువల్ల.. ఆ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!