కరోనా బారిన పడిన హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్‌ను రోహ్తక్లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 5న ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. అప్పటి నుంచి శనివారం రాత్రి వరకు ఆయన అంబాలాలోని సివిల్ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నారు. అయితే తనకు అసౌకర్యంగా ఉందని మంత్రి చేసిన ఫిర్యాదు చేయగా పీజీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రత్యేక వైద్య బృందం ప్రస్తుతం అనిల్ విజ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అంబాలా సివిల్ సర్జన్ కుల్దీప్ సింగ్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.
ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా మరో 30,254 మందికి కరోనా