ETV Bharat / bharat

'పండగల వేళ జాగ్రత్త- కరోనాపై అలసత్వం వద్దు' - కరోనా నివారణ

పండగల సీజన్​లో కరోనా(covid-19) కట్టడిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. రద్దీ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు అమలయ్యేలా చూడాలని పేర్కొంది. పలు జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా ఉందని.. ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థవంతమైన చర్చలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

mha covid guidlines
కరోనా కట్టడి
author img

By

Published : Aug 28, 2021, 9:53 PM IST

పండగల సీజన్​ను దృష్టిలో ఉంచుకొని కరోనా(covid-19) విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. జనాలు పెద్దగా గుమిగూడకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని అంచనా వేసేందుకు క్రియాశీల చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం అమలవుతున్న కరోనా మార్గదర్శకాలను(covid guidelines) సెప్టెంబర్ 30 వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కరోనా పరిస్థితి జాతీయ స్థాయి(covid in India)లో స్థిరంగానే ఉందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా(ajay bhalla) అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా కేసుల పెరుగుదల కనిపిస్తోందని చెప్పారు. పలు జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా ఉందని అన్నారు. దీనిపై అన్ని రాష్ట్రాల సీఎస్​లకు లేఖలు రాశారు.

"కేసులు అధికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీల యంత్రాంగాలు.. కట్టడి చర్యలు చేపట్టాలి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థవంతమైన చర్చలు తీసుకోవాలి. కేసుల పెరుగుదలను ముందుగానే గుర్తించి.. వ్యాప్తిని అరికట్టాలి. ఇందుకోసం ఆరోగ్య శాఖ సూచించిన క్షేత్రస్థాయి విధానాలు అవలంబించాలి. "

-అజయ్ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి

కరోనా నిబంధనలు అమలు చేయడంలో కొంత అలసత్వం కనిపిస్తోందని భల్లా అన్నారు. కరోనాను నివారించడంలో ఈ నిబంధనలను సమర్థంగా అమలు చేయడమే కీలకమని చెప్పారు. టీకా పంపిణీ(vaccination in india)లో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకొని.. అర్హులందరికీ టీకా అందేలా చూడాలని సూచించారు.

మరిన్ని సూచనలు

  • పండగల సీజన్​లో ప్రజలు గుమిగూడకుండా చూడాలి. స్థానికంగా లాక్​డౌన్(lockdown) విధించే అంశాన్ని పరిశీలించాలి.
  • రద్దీ ప్రాంతాల్లో ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలి.
  • కరోనాను సమర్థంగా కట్టడి చేసేందుకు ఐదు సూత్రాల(టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనలు పాటించడం) వ్యూహాన్ని పాటించాలి.

కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య(covid cases in India) స్థిరంగా కొనసాగుతోంది. మూడో రోజూ 40వేలకుపైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 46,759 మంది వైరస్​(Covid-19) బారినపడ్డారు. మరో 509 మంది మరణించారు.

ఇదీ చదవండి:

పిల్లలపై కరోనా పంజా- కొత్త కేసులు వారిలోనే అధికం!

భారత్‌లో కొవిడ్‌ అధ్యయనానికి గిన్నిస్‌ రికార్డ్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.