Covid Cases in India: కేరళలో మరోసారి 50వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ తగ్గుముఖం పట్టి సోమవారం 42వేల కేసులు నమోదు కాగా.. మంగళవారం ఆ సంఖ్య 51,887కు చేరింది. మరోవైపు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కొత్తగా 1,205 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 60,77,556కు చేరింది. 56,53,376 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య 55,600కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,67,847గా ఉంది.
ఆంక్షల సడలింపు
ముంబయిలో కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించింది అక్కడి ప్రభుత్వం. రాత్రి కర్ఫ్యూను రద్దు చేసి.. రెస్టారెంట్లు, థియేటర్లు 50 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతించింది.
వివాహాలను ఫంక్షన్ హాళ్లలో 25 శాతం సామర్థ్యం లేదా 200 మంది మించకుండా అతిథులతో జరుపుకోవచ్చని స్పష్టం చేసింది.
మరోవైపు మహారాష్ట్రలో భారీగా కరోనా మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 94 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రం | కొత్త కేసులు | మరణాలు |
తమిళనాడు | 16,096 | 35 |
మహారాష్ట్ర | 14,372 | 94 |
కర్ణాటక | 14,366 | 58 |
గుజరాత్ | 8,338 | 38 |
ఆంధ్రప్రదేశ్ | 6,213 | 5 |
తెలంగాణ | 2,850 | 2 |
దిల్లీ | 2,683 | 27 |
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి : యూట్యూబ్లో మోదీనే నెం.1.. సబ్స్క్రైబర్లు తగ్గేదేలె..!