దేశంలో రోజూ స్థిరంగా 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 41 వేల 322 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
మొత్తం కేసుల సంఖ్య 93 లక్షల 51 వేల 110కి చేరింది. వైరస్ ధాటికి మరో 485 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 1లక్షా 36వేల 200కు పెరిగింది.
కరోనా బారినపడిన వారిలో ఇప్పటివరకు 87లక్షల 59వేల 969 మంది కోలుకున్నారు. 4లక్షల 54వేల 940 యాక్టివ్ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 93.68 శాతం ఉండగా.. మరణాల రేటు 1.46 శాతంగా నమోదైంది.
ఇదీ చదవండి: టీకా టూర్: అహ్మదాబాద్ చేరుకున్న మోదీ