దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా రెండో వేవ్ సునామీలా విరుచుకుపడే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా రెండో లాక్డౌన్ గురించి సూచనలు చేశారు.
ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ఠాక్రేతోపాటు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్.. ప్రజలకు సూచించారు. మాస్కులు, భౌతిక దూరం, పరిశుభ్రత వంటి నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు.
"మనకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ వ్యాధికి చికిత్స లేదు. అందుకే మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం వహిస్తే మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశం ఉంది. మనకు మరో లాక్డౌన్ వద్దు. ఈ ఐదేళ్లు లాక్డౌన్లతోనే గడిపేయాలనుకోవట్లేదు. ముప్పు ఇంకా తొలగిపోలేదు. పండుగల వేళ సంయమనం పాటించాలి."
- ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం
ఇదీ చూడండి: టీకా అత్యవసర అనుమతులపై కేంద్రం దృష్టి