ETV Bharat / bharat

'హోం ఐసోలేషన్లో రెమ్​డెసివిర్ తీసుకోవద్దు'

హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న కరోనా రోగులు రెమ్​డెసివిర్ ఇంజక్షన్​ తీసుకోవాల్సిన అవసరం లేదని ఎయిమ్స్​ వైద్యులు తెలిపారు. ఆక్సిజన్​ స్థాయి 94కంటే తక్కువకు పడిపోతే వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు.

home isolation
హోం ఐసోలేషన్​
author img

By

Published : May 15, 2021, 9:54 PM IST

హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న కరోనా రోగులు రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​ను తీసుకోవద్దని ఎయిమ్స్​ వైద్యులు సూచించారు. ఒక వేళ వారిలో ఆక్సిజన్​ స్థాయి 94కంటే తక్కువకు పడిపోతే ఆసుపత్రిలో చేరాలని తెలిపారు. హోం ఐసోలేషన్​లో ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎయిమ్స్ వెద్యులు వెబినార్​ నిర్వహించారు.

"ఇంటివద్ద రెమ్​డెసివిర్​ ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే ఆశావాద దృక్పథం కలిగి ఉండాలి."

-డాక్టర్​ నీరజ్​ నిశ్చల్​, ఎయిమ్స్​

"కరోనా నుంచి కోలుకున్న 80శాతం మందిలో మళ్లీ సల్వ మోతాదులో కొవిడ్​ లక్షణాలు కనబడుతున్నాయి. మళ్లీ వారు ఆర్​టీ పీసీఆర్​ పరీక్ష చేయించుకోవాలి. ఆర్​టీ పీసీఆర్​ ఫలితం నెగటివ్​ వచ్చి, లక్షణాలు ఉంటే మరో సారి పరీక్ష చేయించుకోవాలి" అని అన్నారు.

60 ఏళ్లు పైబడి, మధుమేహం​, గుండె సమస్యలు, ప్రాణాంతక వ్యాధులున్న కరోనా రోగులు వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి: 'స్టిరాయిడ్ల దుర్వినియోగమే.. బ్లాక్​ ఫంగస్​కు​ కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.